బాబు రాజకీయం అంటే ఇదేనా ..? వామ్మో!     2018-05-15   04:01:25  IST  Bhanu C

రాజకీయాలకే రాజకీయం నేర్పగల మేధావి .. వ్యూహకర్త , దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేయగల వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే అది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అనేది అందరూ అంగీకరించే నిజం. ఎన్ని వడిదుడుకులు వచ్చినా సరే ఆయన ప్రభుత్వాన్ని, పార్టీని ధైర్యంగా ముందుకు నడిపించే తీరు చూస్తుంటే అతడు ఎంత సమర్ధుడో ఇట్టే అర్ధం అయిపోతుంది. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీని, క్యాడర్ ను నడిపిస్తున్న తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

బాబు ఎంత కష్టపడుతున్నా.. కొంతమంది నాయకులు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ప్రవర్తిస్తూ పార్టీ పరువును బజారున పడేస్తున్నారు. ఇటువంటి నాయకులను కట్టడి చేసేందుకు బాబు చక్కని ప్లాన్ అమలు చేసి వారిని దారిలో పెట్టగలిగారు. ఇంతకీ విషయం ఏంటంటే.. రాష్ట్రంలోన ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ అనే ధీమాతో ఎవరికీ వారు అనేక మార్గాల ద్వారా తమ జేబులు నింపుకుంటున్నారు అనేది అందరికి తెలిసిన వాస్తవం.