బాబు ని దాటేసిన జగన్ ! సర్వేలో బయటపడిన నిజం     2018-05-31   20:08:23  IST  Bhanu C

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపు తీసుకొచ్చే కిక్ ఉన్న విషయం బయటకి వచ్చింది. దాని ప్రకారం చూస్తే .. ఏపీ, తెలంగాణ సీఎంల కంటే వైసీపీ అధ్యక్షుడు జగన్ ముందువరసలో నిలబడ్డాడు. దేశం లో నా అంత సీనియర్ లేడు .. నన్ను మించిన నాయకుడు మీకు ఎక్కడా దొరకదు అంటూ గొప్పలు చెప్పుకునే బాబు జగన్ తరవాతి స్థానంలో ఉన్నాడు. జాతీయ మీడియా సర్వేలలో ఇదే విషయం తేలిందట.

ఇది నిజంగానే ఇది గొప్ప విషయంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్ అధికారం లేకపోయినా నిరంతరం ప్రజల్లో తిరుగుతూ.. జనాదరణ బాగా పొందగలిగాడు. ఇదే సమయంలో ప్రభుత్వాన్ని సమస్యల విషయం లో బాగానే నిలదీస్తున్నాడు. ఇవన్నీ ఆయనకు బాగా కలిసి వచ్చినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా తన పార్టీ ఎమ్యెల్యేలను అధికార పార్టీ టీడీపీ లాగేసుకున్నా.. ఏమి అధైర్యపడకుండా నిరంతరం జగన్ పోరాడుతున్నాడు.

మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్‌లో జగన్ తర్వాత స్థానంలో ఉన్నాడు. మోడీ అగ్రస్థానంలో ఉన్న ఈ జాబితాలో చంద్రబాబు 36వ స్థానంలో ఉంటే జగన్ మాత్రం 35వ స్థానంలో ఉన్నాడు. చంద్రబాబు కంటే ముందు జగన్ ఎలా అన్న ప్రశ్నకు కూడా ఆ జాతీయ మీడియా సంస్థ వివరణ ఇచ్చింది. ప్రత్యేక హోదాతో సహా అన్ని విషయాల్లోనూ చంద్రబాబు జగన్‌నే ఫాలో అవుతున్నాడని, హామీల విషయంలో కూడా జగన్ ఇచ్చిన హామీలను కాపీ కొట్టాల్సిన దుస్థితిలో చంద్రబాబు ఉన్నాడని, అన్నింటికీ మించి జగన్‌కి ఉన్న ప్రజాదరణ రోజు రోజుకూ పెరుగుతోందని ఆ జాతీయ మీడియా సంస్థ వివరించింది.