బాబు గారు “జగన్ చీటీ” కాదు..మన చీటీ చిరిగిపోతోంది..       2018-06-11   01:24:39  IST  Bhanu C

కడప కోటలో జగన్ కి చుక్కలు చూపిస్తున్నాం..వచ్చే ఎన్నికల్లో జగన్ ఖంగుతినడం ఖాయం..జగన్ కోటకి బీటలు పడుతున్నాయి ఒక్కొక్కరు జగన్ ని కడప లో వ్యతిరేకిస్తున్నారు..హబ్బా గత కొన్ని నెలలుగా టీడీపీ అధినేత జగన్ పై చేస్తున్న కామెంట్స్ ..అంతేకాదు చంద్రబాబు గారి అబ్బాయి గారు లోకేష్ బాబు గారు కూడా ఇవే రకమైన కామెంట్స్ తో హల్చల్ చేస్తున్నారు..మేము ఏమన్నా తక్కువ తిన్నామా మేము కూడా బాబు గారు చిన బాబు గారి దృష్టిలో పడాలి అంటూ టీడీపీ నేతలు తమ అనుకూల మీడియాలో వాళ్ళ ఊహలకి అందని విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు..అయితే అసలు వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది..బాబు గారు ఏందీ ఈ లొల్లి కడపలో మన నావ మునిగిపోతోంది తెడ్డు వెయ్యండి మహా ప్రభో అంటూ తెలుగుదేశం నాయకులు మోర పెట్టుకుంటున్నారు..

కడపలో జగన్ కి టీడీపీ షాక్ ఇవ్వడం పక్కన పెడితే టీడీపీ కి మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి..కడప టీడీపీ అంతర్గత రాజకీయాలు రచ్చకు ఎక్కుతున్నాయి…ఇప్పటికే కడపలో జంప్ జిలానీ మంత్రి ఆదినారాయరెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వివాదం పీక్ స్టేజి కి వెళ్ళింది ఇది అందరికీ తెలిసిందే. ఇటీవల జరిగిన మహానాడులో ఈ ఇద్దరు నేతల మధ్య విబేధాలను చూసి పార్టీ నేతలే షాక్ తిన్నారు ఆఖరికి సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్నప్పటికీ…బాబు ని కూడా లెక్క చేయకుండా కడప లో ఒకరిని ఒకరు తిట్టుకుంటూ పరువు పోగొట్టుకుంటున్నారు…

ఇదిలాఉంటే అదే తరహాలో మరొక తలనెప్పి బాబు గారికి తగిలింది..టీడీపీ సీనియర్ నేత – పార్టీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడనే పేరున్న ఎంపీ సీఎం రమేష్ పై మాజీ ఎమ్మెల్యే – ప్రొద్దుటూరు టీడీపీ ఇంఛార్జ్ వరదరాజులు రెడ్డి చేసిన ఆరోపణలు సంచలనం అయ్యాయి…చంద్రబాబు దయతో రాజ్యసభ సభ్యుడు అయిన రమేష్ కి ఇక్కడ పంచాయితీలో కూడా గెలిచే సత్తాలేదు అంటూ పెద్ద బాంబు వేశారు..దాంతో చంద్రబాబు కి వరదరాజులు ఇచ్చిన షాక్ తో మైండ్ బ్లాక్ అయ్యింది..

సీఎం రమేష్… బద్వేల్ , ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి, కమలాపురం, పోడూరు, రాజంపేట..ఇలా అన్ని ఏరియాల్లో గ్రూపులు ఏర్పాటు చేసుకుని రెచ్చగొడుతున్నారని వరదరాజులు రెడ్డి ఆరోపించారు..జిల్లా ల వారిగా నీ పెత్తనం ఏందీ నువ్వు ఏమన్నా పోటుగాడివా అంటూ వరదరాజులు చేసిన వ్యాఖ్యలకి ఇప్పటికీ రమేష్ కోలుకోలేక పోతున్నారట..పైగా చంద్రబాబు నిర్ణయాన్నే దిక్కరించేలా సీఎం రమేష్ వ్యవహరిస్తున్నారనే సందేశాన్ని కూడా పంపిస్తోంది. ఓవైపు మంత్రి వర్సెస్ ఎమ్మెల్సీ – మరోవైపు ఎంపీ వర్సెస్ నియోజకవర్గ ఇంచార్జీ అన్నట్లుగా జరుగుతున్న గొడవలలో కడపలో టీడీపీ చిత్తయ్యి పోతుంటే చంద్రబాబు మాత్రం కడపలో వైసీపి ఖతం..బీటలు పడుతోంది అని చెప్పడం దేనికి నిదర్సనమో ప్రజలే తేల్చాలి అంటున్నారు వైసీపి నేతలు.