బాబుకు నైజాలు ఇవీ.. న‌మ్మిన‌బంట్ల నిజం ప‌లుకులు!     2018-06-17   22:49:33  IST  Bhanu C

వాస్త‌వం చెప్పాల్సిన స‌మ‌యంలోనూ మ‌సి పూసి మారేడు కాయ చేయ‌డంలో ఏపీ సీఎం చంద్ర‌బాబుకు, ఆయ‌న టీంకు కొత్త‌కాదు. ఎన్నిక‌లు లేని స‌మ‌యంలోనే ఏపీ ప్ర‌జ‌ల క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టిన ఈ బృందాలు.. ఇప్పుడు ఎన్నిక‌లు వ‌స్తున్న స‌మ‌యంలో గంత‌లు కాదు.. మ‌రింత‌గా ప్ర‌జ‌ల దృష్టిని దారి మ‌ళ్లించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ ప‌త్రిక వారం వారం రాసుకునే ప‌లుకులు.. కొన్ని.. తాజాగా.. సీఎంకు అనుకూలంగా రాసినా.. అస‌లు వాస్త‌వాల‌ను మాత్రం బ‌య‌ట పెట్టింది. బాబులోని నైజాన్ని నిష్క‌ర్ష‌గా వెల్ల‌డించింది. చంద్ర‌బాబుకు రాజ‌కీయ పాఠాలు అక్క‌ర్లేదు. ఆయ‌న‌కు తెలియ‌ని రాజ‌కీయాలు ఉంటే క‌దా?! ఆయ‌నకు రాజ‌కీయాల్లో ఎవ‌రూ శ‌త్రువులు లేరు కూడా. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఆయ‌న అంద‌రితోనూ క‌లిసిపోతారు.

అంతేకాదు.. ఆ ప‌లుకులు వెల్ల‌డించిన స‌మ‌చారం ప్ర‌కారం.. బాబు న‌ల‌భైఏళ్ల రాజ‌కీయ చ‌రిత్ర‌లో అవ‌స‌రం కోసం.. శ‌త్రువుల‌ను కూడా మిత్రులు చేసుకుంటారు. ఏపీ ప్ర‌త్యేక హోదా వ‌ద్ద‌న్న నోటితోనే ఆయ‌న హోదా కోసం ధ‌ర్మ పోరాటాలు చేస్తున్నారు. ఏపీకి కేంద్రం ఎంతో చేసింద‌ని చెప్పిన నోటితోనే ఆయ‌న కేంద్రం ఒక్క‌పైసా కూడా ఇవ్వడం లేద‌ని చెప్పుకొచ్చారు. మొత్తంగా కేంద్రంలోని బీజేపీతో నాలుగేళ్లు అంట‌కాగిన ఆయ‌నే ఇప్పుడు బీజేపీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అయితే, ప‌లుకులు చెప్పిన మాట‌ల‌ను బ‌ట్టి.. వ‌చ్చేఎన్నిక‌ల నాటికి బీజేపీనే యూట‌ర్న్ తీసుకుంటే.. ఏపీకి ప్ర‌త్యేక హోదాతోపాటు విభ‌జ‌న హామీలు అమ‌లు చేస్తామ‌ని చెబితే.. చంద్ర‌బాబు.. మ‌ళ్లీ బీజేపీతో అంట‌కాగేందుకు రెడీ అవుతున్నారు.

ఇక‌, రాజ‌కీయంగా త‌న ల‌బ్ధిని తాను ఏనాడూ విడిచిపెట్ట‌ని బాబు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు కూడా సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు వైసీపీపై తీరుబ‌డిగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. నాలుగేళ్లు నా పాల‌న‌ను మెచ్చుకున్న జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ ఇప్పుడు విమ‌ర్శ‌లు చేస్తున్నాడంటే.. ఇది బీజేపీ కుట్ర‌లో భాగ‌మేన‌ని చెప్ప‌గ‌లిగిన చంద్ర‌బాబు.. అదే బీజేపీని.. నాలుగేళ్ల‌పాటు ఆయ‌న కూడా పొగిడి.. తిరుప‌తి ప్ర‌సాదాన్ని పోస్టులో పంపించిన విష‌యాన్ని ప‌క్క‌కు పెట్టేశారు. ఇక‌, నోట్ల ర‌ద్దును పూర్తిగా స‌మ‌ర్ధించిన బాబు.. తాను చెప్పిన సూచ‌న‌ల మేర‌కే కేంద్రం పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసింద‌ని తాను కేంద్రాన్ని సైతం శాసించ‌గ‌ల‌న‌ని చెప్పుకొచ్చారు.

ఇప్పుడు దీనిపై దేశం మొత్తం అట్టుడుకుతున్న నేప‌థ్యంలో నైస్‌గా దీని నుంచి త‌ప్పుకొన్నారు. పెద్ద నోట్ల ర‌ద్దును త‌ప్పుప‌డుతు న్నారు. మొత్తంగా.,. బాబుకు ఆయ‌న న‌మ్మిన బంటు రాసిన‌ట్టు.. ఏ ఎండ‌కు ఆగొడుగు ప‌ట్ట‌డం వెన్న‌తో పెట్టిన విద్య‌. వినేవాడు ఉండాలే కానీ.. తాను చెప్పాను కాబ‌ట్టే.,. వ‌ర్షాలు ప‌డుతున్నాయ‌ని చెప్పుకొనే వ్య‌క్తిత్వం ఆయ‌న సొంతం. మొత్తానికి ఇప్ప‌టి వ‌ర‌కు వ్య‌తిరేక ప్ర‌చారం చేయ‌కపోయినా.. ఆయ‌న‌కు పాజిటివ్‌గా రాసిన వ్యాఖ్య‌లే.. ఇప్పుడు ఆయ‌న‌కు బూమ‌రాంగ్ మాదిరిగా ఎదురు తిరుగుతున్నాయి.