బాత్రూమ్ లో నుండి ఏమండి..అని పిలిచిందంటే అర్ధం ఏంటో తెలుసా?     2018-06-09   00:44:25  IST  Raghu V

#1. బాత్రూమ్ లో నుండి ” ఏమండి” అని పిలిచిందంటే బొద్దింకని కొట్టాలని అర్ధం..

#2. 🎲రెస్టారెంట్ లో తిన్నాక ” ఏమండీ” అని పిలిచిందంటే బిల్లు కట్టమని అర్ధం

#3. 🎲కళ్యాణమండపంలో ” ఏమండీ” అని పిలిచిందంటే తెలిసినవారొచ్చారని అర్ధం

#4. 🎲బట్టల షాపులో ” ఏమండీ” అని పిలిచిందంటే వెతుకుతున్న చీర లభించిందని అర్ధం..

#5. 🎲బండిలో వెళ్ళేటపుడు ” ఏమండీ” అని పిలిచిందంటే పూలు కొనాలని అర్ధం..

#6. 🎲హాస్పిటల్ కి వెళ్ళినపుడు ” ఏమండీ ” అని పిలిచిందంటే డాక్టర్ తో మీరూ మాట్లాడడానికి రండి అని అర్ధం

#7. 🎲వాకిట్లోకి వచ్చి బయట చూసి ” ఏమండీ” అని పిలిచిందంటే తెలియనివారెవరో వచ్చారని అర్ధం..