బతికుండగానే భార్య ని పూడ్చివేసిన భర్త.. అసలు కారణం ఏంటో తెలుసా....  

Husband Buried His Wife A-divorse,general Telugu Updates,husband,mexico,పూడ్చివేసిన,బతికుండగానే భార్య

ఇటీవల కాలం లో భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు కూడా విడాకుల వరకు వెళ్తున్నాయి. విడాకుల కోసం కోర్ట్ మెట్లు ఎక్కుతున్న దంపతులు న్యాయస్థానం లో వింత కారణాలు చెప్పి విడాకులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. మన దేశం లో దంపతులిద్దరూ విడాకులకు అంగీకరిస్తేనో లేదా ఏదైనా బలమైన కారణం ఉంటేనో తప్ప విడాకులు తీసుకోవచ్చు..

బతికుండగానే భార్య ని పూడ్చివేసిన భర్త.. అసలు కారణం ఏంటో తెలుసా....-Husband Buried His Wife Alive

అయితే విదేశాల్లో మాత్రం విడాకులు తీసుకుంటే భర్త ఆస్తి లో భార్య కు సగం వాటా ఇవ్వాల్సిందే. అలా భార్య విడాకులు అడిగినందుకు ఒక భర్త ఏం చేసాడో తెలుసా…

మెక్సికో కి చెందిన ఈవిల్ రేనే అతను తన భార్య తో కొద్దీ కాలంగా సరిగ్గా ఉండట్లేదు. దీనితో వీరి మధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయి.

దీనితో ఈవిల్ రేనే భార్య కి తన తో కలిసి జీవించడం ఇష్టం లేక విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త తన భార్య ని విడాకులు దరఖాస్తు ను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరాడు. దానికి ఆమె అంగీకరించలేదు.

దానితో బతికున్నపుడే తన భార్య ని పూడ్చివేశాడు.

భార్య ని పూడ్చివేయడానికి అసలు కారణంమెక్సికోలో భార్య భర్తల విడిపోయినపుడు భర్త ఆస్తిలో భార్యకు సమాన వాటా లభిస్తుంది. ఈవిల్ రేనే భార్య విడాకులు దరఖాస్తు చేసాక ఎక్కడ ఆస్తిలో సగ భాగం ఇవ్వాల్సివస్తుందో అని తన తమ్ముడు మరో ఐదుగురితో కలిసి పక్కా ప్రణాళికతో ఈ పని చేసినట్టు అక్కడి పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం రేనే భార్య కారులో వెళుతుండగా ఆమె ఓ ప్రదేశంలో కారు దిగేలా చిన్న యాక్సిడెంట్ డ్రామా చేశారు , ఆమె కారు దిగిన వెంటనే ఆమె చేతులను కట్టేసి ఈవిల్ తమ్ముడికి చెందిన స్థలానికి తీసుకెళ్లి ముందుగానే తీసిన గోతిలో పడేశారు.

అనంతరం ఆమెపై మట్టి, సిమెంట్‌ పోసి పూడ్చేశారు. 2014 లో జరిగిన ఈ సంఘటన గురించి విచారణలో ఈ మధ్యే బయటకి వచ్చింది.దీనితో ఈ నేరానికి సంబందించిన 7 గురిని న్యాయస్థానం లో ప్రవేశ పెట్టగా అక్కడి కోర్ట్ వారికి 51 సంవత్సరాల జైల్ శిక్ష విధించింది.