ఫోన్లో కంప్యూటర్ తీరు డిస్ ప్లే కావాలా?     2017-09-16   04:36:58  IST  Raghu V

రోజు అదే మొబైల్ వాడతాం, అవే మెను ఐకాన్లు, అవే ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్, అవే మోషన్ ఎఫెక్ట్స్ .. ఇలా రోజు ఉంటే ఏదో ఒక రోజు మన ఫోన్ మీద బోర్ కొడుతుంది. కొన్నిరోజులు పోయాక ఫోన్ ఒక అవసరమే తప్ప, ఆకర్షణ కాదు. వాట్సాప్ వాడాలి కాబట్టి, ఫేస్ బుక్ వాడాలి కాబట్టి, మంచి మంచి ఫోటోలు తీసుకోవాలి కాబట్టి .. ఇలా అవసరం కోసమే స్మార్ట్ ఫోన్ వాడతం. ఈ యాప్స్ 5 వేల రూపాయలకు వచ్చే స్మార్ట్ ఫోన్లో కూడా దొరుకుతాయి. కాని మనకు కొంచెం ఖరీదైన ఫోనే ఎందుకు కావాలి? ఎందుకు అంటే కొత్తరకనైన ఇంటర్ఫేస్ కోసం. ఓ కొత్త అనుభవం కోసం.

అసలు ఇంటర్ఫేస్ కోసం కొత్త మొబైల్ దాకా వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇంటర్ఫెస్ ని మార్చుకునేందుకు ఎన్నో లాంచర్స్ ఉన్నాయి కదా. Xiaomi Redmi మొబైల్స్ లో అయితే కుప్పకుప్పలుగా థీమ్స్ ఉన్నాయి. రోజుకి ఓ కొత్త థీన్ అప్లై చేసుకోని మన పాత మొబైల్ నే రోజూ కొత్తగా చూసుకోవచ్చు. మిగితా బ్రాండ్స్ అలాంటి సర్వీసులు ఇవ్వడం లేదు కదా అని డిజపాయింట్ అవ్వొద్దు‌‌. ఎందుకంటే ప్లేస్టోర్ లో ఎన్నో లాంచర్స్ ఉంటాయి. అందులో ఒక వెరైటి లాంచర్ పేరు win 10 launcher.