ప‌వ‌న్ - పూన‌మ్ రిలేష‌న్‌పై సీక్రెట్ ఆప‌రేష‌న్‌...!       2018-04-15   22:44:19  IST  Bhanu C

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో కొద్ది రోజులుగా వివాదాలు ముసురుకుంటున్నాయి. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌ర్సెస్ క‌త్తి మ‌హేష్ వార్‌, ఆ త‌ర్వాత శ్రీరెడ్డి న‌గ్న నిర‌స‌న‌, కాస్టింగ్ కౌచ్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వివాదాలు వ‌రుస‌గా వ‌స్తున్నాయి. ఇక గ‌త మూడు నెల‌లుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ వ‌ర్సెస్ క‌త్తి మ‌హేష్ మ‌ధ్య జ‌రుగుతోన్న వార్‌తో అనేక విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. వీటిల్లో నిజానిజాలు ఎలా ఉన్నా ప‌వ‌న్ పాలిటిక్స్‌లో పూర్తిగా యాక్టివ్ అవ్వ‌డంతో ఇప్పుడు ఇవి కూడా హాట్ హాట్‌గా మారాయి.

ఈ వివాదంలోకే క‌త్తి మ‌హేష్ హీరోయిన్ పూన‌మ్ కౌర్‌ను కూడా లాగాడు. క‌త్తి ఆమెకు ఆరు ప్ర‌శ్న‌లు వేసి వాటికి ఆన్స‌ర్ చెప్ప‌మ‌ని స‌వాల్ చేయ‌డం పెద్ద సంచ‌ల‌న‌మైంది. ఇక ప‌వ‌న్‌కు పూన‌మ్‌కు మ‌ధ్య అస‌లు ప‌రిచ‌యం ఉంద‌న్న విష‌య‌మే చాలా మందికి తెలియ‌దు. ఈ వివాదంలోకి క‌త్తి మ‌హేష్ ఆమె పేరును లాగ‌డంతో వీరిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగిందా ? అస‌లు రిలేష‌న్ ఏంట‌న్న ప్ర‌శ్న‌లు, అనుమానాలు రేకెత్తాయి.

ఆ త‌ర్వాత పూన‌మ్ కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా కొంద‌రు వాడుకుని చీట్ చేస్తారంటూ పెట్టిన పోస్టుల‌పై కూడా చాలా మంది ప‌వ‌న్‌పైనే సందేహాలు వ్య‌క్తం చేశారు. విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఇప్పుడు వీరిద్ద‌రికి సంబంధించిన రిలేష‌న్‌పై కూపీ లాగేందుకు అధికార పార్టీకి అనుకూలంగా ఉండే ఓ మీడియా పెద్ద ఎత్తున ఆప‌రేష‌న్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. అస‌లు వీరిద్ద‌రి ప‌రిచ‌యం ఎక్క‌డ స్టార్ట్ అయ్యింది ? త‌్రివిక్ర‌మ్ అంటే పూన‌మ్‌కు ఎందుకు కోపం ? క‌త్తి చెప్పిన‌ట్టు ప‌వ‌న్ – పూన‌మ్ మ‌ధ్య ఉన్న లింకులేంట‌న్న దానిపై ఇప్ప‌టికే కొంత డేటా ఆ ఛానెల్ వాళ్లు సేక‌రించార‌ట‌.

ఇక అదే మీడియాకు సంబంధించిన ఓ టీం పూన‌మ్ స్వ‌స్థ‌లం అయిన పంజాబ్ బయల్దేరడానికి సిద్దమయ్యారట. ఏదేమైనా అధికార పార్టీ మీద, ఆ పార్టీ అధినేత మీద ఈగ కూడా వాల‌నివ్వ‌ని ఆ మీడియా ఏదోలా ప‌వ‌న్ – పూన‌మ్ మ‌ధ్య రిలేష‌న్‌పై కూపీ లాగి, ఉన్న‌ది లేనిది క‌లిపి క‌థ‌నాలు వేసి ప‌వ‌న్ రాజ‌కీయ ఇమేజ్ దెబ్బ‌కొట్టే ప్లాన్ జ‌రుగుతుంద‌న్న వార్త‌లు ఇప్పుడు మీడియాతో పాటు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.