ప‌వ‌న్ కు బ్యాడ్ టైం స్టార్ట‌యిందా..?       2018-05-27   01:25:48  IST  Bhanu C

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు బ్యాడ్ టైం స్టార్ట‌యిందా? ఆయ‌న‌కు ఏపీలో అధికార పార్టీ నుంచి కానీ, ప్ర‌భుత్వం నుంచి కానీ ఆశించిన మేర‌కు ఎలాంటి గుర్తింపూ ల‌భించ‌డం లేదా? ఈ ప‌రిణామాలు జ‌న‌సేన‌ను కుదేలయ్యేలా చేస్తున్నాయా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. అంతేకాదు, ఇప్పుడున్న ప‌రిస్థితిలో సీఎం చంద్ర‌బాబు.. ప‌వ‌న్‌కు అప్పాయింట్ మెంట్ కూడా ఇచ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం ఉత్త‌రాంధ్ర జిల్లా అయిన శ్రీకాకుళంలో ప‌ర్య‌టిస్తున్నారు.

అక్క‌డే 45 రోజుల పాటు ఆయ‌న బ‌స్సు యాత్ర నిర్వ‌హిస్తారు. అక్క‌డి స‌మ‌స్య‌ల‌పై పోరుగ‌ళం వినిపిస్తారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తాజాగా మ‌ళ్లీ ఉద్దానం కిడ్నీ బాధితుల స‌మ‌స్య‌లు భుజాన వేసుకున్నారు. గ‌తంలోనే తాను ఈ స‌మ‌స్య‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లాన‌ని, అయితే, ప్ర‌భుత్వం మాత్రం ఈ స‌మ‌స్య‌ను ప‌ట్టించు కోకుండా ప‌క్క‌న పెట్టింద‌ని ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో మ‌రో 48 గంట‌ల గ‌డువు ఇస్తున్నాను. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం స్పందించి ఉద్దానం కిడ్నీ బాధితుల‌కు భ‌రోసా క‌ల్పించాల‌ని ప‌వ‌న్ రెండు రోజుల కింద‌ట డిమాండ్ చేశాడు.

అయితే, దీనిపై చంద్ర‌బాబు కానీ, ఇత‌ర మంత్రులు కానీ ఎక్క‌డా స్పందించ‌లేదు. క‌నీసం ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న చేశార‌నే ఊసు కూడా లేకుండా మ‌హానాడు ఏర్పాట్ల‌లో మునిగితేలుతున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ప‌వ‌న్ ప్ర‌స్తుతం దీక్ష చేప‌ట్టారు. ఈ రోజు సాయంత్రం వ‌ర‌కు కూడా ఈ దీక్ష కొన‌సాగ‌నుంది. కిడ్నీ బాధితులకు ప్రభుత్వం తక్షణం అండగా నిలబడాలని, ఉద్దానంలో హెల్త్‌ ఎమర్జెన్సీ విధించాలని కోరారు. వెంటనే రాష్ట్రంలో ఆరోగ్య మంత్రిని నియమించాలని.. ఉద్దానం బాధితుల కోసం ప్రత్యేక పర్యవేక్షక వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ.. ఇవన్నీ నెరవేర్చడానికి ప్రభుత్వానికి 48 గంటల గడువు విధించారు.

ఉద్దానం కిడ్నీ బాధితులకు న్యాయం చేయాలంటూ పార్టీ తరఫున 17 డిమాండ్లతో కూడిన పత్రాన్ని విడుదల చేశారు. అయినా కూడా ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేదు. దీంతో ప‌వ‌న్ .. దీక్ష‌కు దిగారు. ఈ విష‌యాల‌ను గ‌మ‌నిస్తున్న ప‌రిశీల‌కులు.. ప‌వ‌న్‌కు బ్యాడ్ టైం స్టార్ట‌యింద‌ని చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. ఖ‌చ్చితంగా ఏడాది కింద‌ట ఇదే ప‌వ‌న్‌.. అమ‌రావ‌తికి వ‌స్తున్నాన‌ని క‌బురు పెట్ట‌గానే సాక్షాత్తూ సీఎం చంద్ర‌బాబే ఎదురు వెళ్లి ప‌వ‌న్‌ను ఆహ్వానించి ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఎప్పుడైతే.. ప‌వ‌న్ యూట‌ర్న్ తీసుకున్నాడో.. ఇక‌, బాబుకూడా మారిపోయారు. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ ఎంత అరిచి గీపెట్టినా.. బాబు ప‌ట్టించుకోర‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.