ప్రియుడితో భార్య పెళ్లి జరిపించాడు ఆ భర్త.! ఆదర్శం కోసం కాదు.! అసలు ట్విస్ట్ ఏంటంటే.?       2018-06-02   01:51:48  IST  Raghu V

మనదేశంలో నూటికి 80శాతం పెళ్లిళ్లు సంప్రదాయబద్దంగానే జరుగుతాయి. అబ్బాయి, అమ్మాయిలకు యుక్తవయస్సు రాగానే పెళ్లి సంబంధాలు చూస్తారు.. పెద్దలు నిర్ణయించిన వివాహాల కన్నా ప్రేమ పెళ్లిళ్లలో ఎక్కువ స్వేచ్చ ఉంటుందని మహిళలు భావిస్తారు. తమకు నచ్చినవాడితో మనువు తమకు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందనుకుంటారు. అన్నింటికీ మించి పెళ్లి తమ ఇష్టానికి అనుకూలంగా జరిగిందన్న ఆనందం వారికి మరింత ఉపశమనాన్నిస్తుంది.

అయితే భార్య మనసు తెలుసుకున్న ఓ భర్త ఆమె అభీష్టం ప్రకారమే ప్రియుడితో పెళ్లి జరిపించాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని చకేరి పరిధిలో చోటు చేసుకుంది. సుజిత్ అలియాస్ గోలు అనే వ్యక్తి ఫిబ్రవరి 19న శ్యామ్ నగర్‌లో శాంతి అనే యువతిని పెళ్లాడాడు. పెళ్లయిన కొద్ది రోజులకే శాంతి ఎవరికీ చెప్పకుండా అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చేసింది. ఎన్ని రోజులైనా భార్య తిరిగి రాకపోవడంతో సుజిత్ ఆమెను కలిశాడు. ఇంటికి ఎందుకు రావడం లేదో చెప్పమని అడిగాడు.

-

తన ప్రేమ విషయాన్ని భర్తకు చెప్పి కంటతడి పెట్టుకుంది. ‘లక్నోకు చెందిన రవిని ప్రేమించాను. కానీ నాకిష్టం లేకుండానే మీతో పెళ్లి చేశార’ని ఏడుస్తూ చెప్పింది.

-

భార్యను అర్ధం చేసుకొని ప్రియుడితో పెళ్లి జరిపిస్తా అని చెప్పాడు సుజిత్. తన భార్య కోరిక నెరవేర్చడం కోసం సుజిత్ లక్నో వెళ్లి రవిని కలిశాడు. ముగ్గురూ కలిసి పెళ్లికి ప్లానేశారు. తర్వాత సుజిత్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బుధవారం స్థానికంగా ఉన్న హనుమంతుడి గుడిలో కుటుంబ సభ్యుల సమక్షంలో వారి పెళ్లి జరిగింది.

-

ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. తన ప్రేమ వ్యవహారం గురించి శాంతి చెప్పగానే.. సుజిత్‌కు పట్టరాని కోపం వచ్చిందట. వాళ్లిద్దర్నీ చంపేద్దామని భావించాడట. ‘అలా చేస్తే ముగ్గురి జీవితాలు నాశనం అవుతాయని భావించా. వారిద్దరికీ పెళ్లి చేస్తే అంతా హ్యాపీగా ఉండొచ్చని భావించాను. అందుకే ఇంట్లో వాళ్లతో మాట్లాడి పెళ్లికి ఒప్పించా’నని సుజిత్ చెప్పాడు.