ప్రదీప్ యాంకర్ కాకముందు ఏం చేసేవాడో తెలుసా..ప్రదీప్ గురించి ఆసక్తికరమైన విషయాలు..     2018-09-23   05:35:15  IST  Rajakumari K

యాంకర్లలో టాప్ ఎవరంటే సుమ అనే పేరు మాత్రమే వినిపిస్తుంది..లేడీస్ ,జంట్స్ లో వేరువేరుగా టాప్ ఎవరంటే జెంట్స్ లో వినపడే మొదటి పేరు ప్రదీప్..యాంకరింగ్ అంటే స్త్రీల పనే అనేది ఒకప్పటి మాట..ఇప్పుడు ఆ మాటని ఇప్పుడు చాలా మంది కొట్టిపారేస్తున్నారు..మేం ఏం తక్కువ కాదు అంటూ మగవాళ్లు ఈ రంగంలోకి వచ్చి తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు..యాంకర్ విజయ్,సురేశ్,సత్తెన్న వీళ్ల బాటలో ఎందరో యాంకరింగ్ వైపు వచ్చారు..కానీ టాప్ స్టేజ్ కి వెళ్లిన వాళ్లు ఎవరైనా ఉన్నారా అంటే ప్రదీప్ మాత్రమే..యాంకర్ కాకముందు ప్రదీప్ ఏం చేసేవాడు..అతడి సంపాదన ఎంత మొదలైన ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

ప్రదీప్ పూర్తి పేరు మాచిరాజు ప్రదీప్, హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాడు. విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో బి.టెక్ పూర్తి చేసాడు. ఒకరోజు టీవీ చూస్తుండగా నూతన నటీనటులు కావాలి అనే యాడ్ చూసిన ప్రదీప్..ఆ యాడ్ లో వచ్చిన నంబర్ కు కాల్ చేస్తే ఆడిషన్ కి రమ్మన్నారట..కాల్ అయితే చేశాడు కానీ యాక్టింగ్ గురించి ఏ మాత్రం అవగాహన లేని ప్రదీప్ అక్కడికి వెళ్లాక బిక్కముఖం వేసుకుని కూర్చున్నాడట. అడిషన్స్ కి వచ్చినవారు డైలాగ్స్ నేర్చుకొని ప్రిపేర్ అయి వస్తే మనోడు మాత్రం ఏం ప్రిపరేషన్ లేకుండా మన వాడుక భాషలో డైలాగ్స్ చెప్పేశాడు అంటా..ఇక్కడే అసలు ట్విస్ట్ ప్రదీప్ సెలక్ట్ అయ్యాడు..సెలక్ట్ అయితే అయ్యాడు కానీ తర్వాత వాళ్ల నుండి ఎలాంటి కాల్ రాలేదు..ఫైనల్ గా ప్రదీప్ కి పిలుపు రాకుండానే సినిమా కూడా రిలీజైంది.

ఇక లాభం లేదు అనుకుని ఏదన్నా ఉద్యోగంలో చేరాలి అని డెసిషన్ తీసుకున్నాడు. ఒక కంపెనీ ప్రొడక్ట్స్ ప్రోమోట్ చేసే ఉద్యోగంలో కుదిరాడు. ఆ కంపెనీ ప్రోడక్ట్ బోర్డు పట్టుకొని ప్రమోషన్లో భాగంగా రోడ్ లో నిల్చునే వాడు.. అలా బ్యానర్ పట్టుకొని రోజుకి 5 గంటలు ఉన్నందుకు రూ.150 ఇచ్చేవారు. ఈ ఉద్యోగం మనకు సెట్ కాదని డిసైడ్ అయి ఆ సేల్స్ ఉద్యోగానికి రాజీనామా చేసి రేడియో ఛానల్లో జాకీగా ఇంటర్వ్యూ కి వెళ్ళాడు. అక్కడ జరిగిన 13 రౌండ్ల ఇంటర్వ్యూ తర్వాత ప్రదీప్ వాయిస్ ఎంపిక చేశారు. అక్కడి నుంచి ప్రదీప్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అతని మొదటి టీవీ షో కోసం ప్రదీప్ తీసుకున్న డబ్బు ఎంతంటే పదిహేను వేలు..

Do You Know About early life of Anchor Pradeep-Do You Know About Early Life Of Anchor Pradeep,Pradeep Machiraju,Pradeep Marchiraju Life Style,Pradeep TV Anchor Life

జీ తెలుగులో ప్రసారం చేయబడిన ‘కొంచెం టచ్ లో ఉంటె చెప్త ‘ ప్రదీప్ కెరీర్ గ్రాప్ మార్చేసిందని చెప్పాలి..ఆ ప్రోగ్రామ్ తో మామూలు టివి ప్రేక్షకులనే కాదు సెలబ్రిటిలను కూడా ఆకర్శించాడు.ఆ ప్రోగ్రామ్లో ఒ ఎపిసోడ్ కి రూ .1 లక్ష రూపాయలు తీసుకుంటన్నాడు ప్రదీప్. అలాగే ఇతర క్రీడల ప్రదర్శనలు, మరియు అవార్డుల వేడుకలకి , ఇతర వినోదం ఆధారిత కార్యక్రమాల కోసం ప్రతి ఎపిసోడ్కు రూ .50,000 చార్జ్ చేస్తున్నాడు అని సమాచారం. సగటున, అతను నెలకు రూ. 20 లక్షల కన్నా పైన సంపాదిస్తున్నాడు.మరోవైపు సినిమా అవకాశాలు ఎలాగూ ఉన్నాయి. ప్రస్తుత యాంకర్లలో ఎక్కువ పారితోషికం పొందుతున్న యాంకర్ ఎవరంటే ప్రదీప్..