ప్రతి సోమవారం శివుడికి పూజ చేసిన తరువాత ఇది సమర్పిస్తే ధనవంతులు అవ్వటం ఖాయం       2017-09-03   23:41:07  IST  Raghu V

శివుడను బోళా శంకరుడు అని పిలుస్తాం. ఆయనకు దోసెడు నీళ్లు సమర్పించిన వారు రాక్షసులు అయినా సరే కోరిన కోరికలను వరాలుగా ఇచ్చేస్తారు. శివుడు ఐశ్వర్యానికి కారకుడు. మనకు ఎంత డబ్బు వచ్చిన శివుని అనుగ్రహం ఉంటేనే చేతిలో నిలుస్తుంది. అందుకే ఎవరైనా ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతుంటే శివుణ్ణి ఈ విధంగా పూజిస్తే త్వరలోనే ధనవంతులు అవుతారు. అది ఎలాగో వివరంగా చూద్దాం.

సోమవారం శివుణ్ణి పువ్వులతో పూజించిన తర్వాత దద్దోజనంను నైవేద్యంగా సమర్పించాలి. దద్దోజనం అంటే పెరుగన్నంలో నేతితో పోపు పెట్టి తయారుచేయాలి. దీన్ని కనుక నైవేద్యంగా పెడితే అప్పు భాదలు ఉండవు. అలాగే డబ్బు ఇబ్బందులు తగ్గి త్వరలోనే ధనవంతులు అవుతారు. సోమవారం అయితే దద్దోజనం నైవేద్యంగా పెడతాం. మరి మిగతా రోజుల్లో ఏమి నైవేద్యం పెట్టాలా అని ఆలోచిస్తున్నారా? మిగతా రోజుల్లో కొబ్బరికాయ,కిస్మిస్, ద్రాక్ష పండ్లు,ఎండు ఖర్జురం నైవేద్యంగా పెట్టాలి. ప్రత్యేకమైన రోజుల్లో పాలతో చేసిన పరమాన్నం లేదా పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.