పొట్ట చుట్టూ కొవ్వు కరిగించే అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు  

పొట్ట చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాలో మనలో చాలా మందికి తెలిసిన విషయమే.ముఖ్యంగా గుండె జబ్బులు,మధుమేహం వంటి వ్యాధులు వస్తాయి.అందువల్ల పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించుకోవటానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయటమే కాకుండా ఇప్పుడు చెప్పబోయే ఆహారాలను తీసుకుంటే ఖచ్చితంగా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది

కరివేపాకు
ప్రతి రోజు పరగడుపున ఐదు కరివేపాకు ఆకులను నమిలి మింగాలి.ఆకులను తినలేని వారు కరివేపాకు పేస్ట్ ని మజ్జిగలో కలుపుకొని త్రాగవచ్చు.ఆలా కూడా త్రాగలేని వారు కరివేపాకును ఎండబెట్టి పొడి చేసుకొని అన్నంలో కలుపుకొని తినవచ్చు.ఏ విధంగా తిన్నా ప్రతి రోజు మాత్రం క్రమం తప్పకుండా తినాలి.

పొట్ట చుట్టూ కొవ్వు కరిగించే అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు-Telugu Health-Telugu Tollywood Photo Image

త్రిఫల పొడి
ఉసిరికాయ, కరక్కాయ, తానికాయలతో తయారుచేసిన పొడిని త్రిఫల పొడి అని అంటారు.ఈ పొడి ఆయుర్వేదం షాప్ లలో దొరుకుతుంది.

ప్రతి రోజు రాత్రి పడుకొనే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో త్రిఫల పొడిని కలుపుకొని త్రాగితే మంచి ఫలితం ఉంటుంది

మెంతుల పొడి
ప్రతి రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ మెంతుల పొడిని కలిపి ఉదయం,సాయంత్రం క్రమం తప్పకుండా త్రాగితే కడుపు నిండిన భావన కలిగి తొందరగా ఆకలి వేయదు.దాంతో పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు