పెళ్ళికి వచ్చిన గిఫ్ట్స్ తో ఆ వధూవరులు ఏం చేసారో తెలుసా.? చూస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే.!       2018-06-06   01:18:13  IST  Raghu V

మన దేశంలో పెళ్ళికి ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే అది జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే వేడుక. పెళ్ళికి వచ్చిన అతిథులు తమ ఆశీర్వచనంగా నవ దంపతులకు డబ్బు రూపకంగానో లేక వస్తువుల రూపకంగా బహుమతులు ఇస్తారు. సాధారణంగా అయితే ఆలా వచ్చిన డబ్బును బ్యాంకులో వేసుకుంటారు లేదంటే తమ ఖర్చులకు వాడుకుంటారు. కానీ ఢిల్లీ నగరానికి చెందిన ఒక జంట మాత్రం బహుమతిగా వచ్చిన డబ్బుతో ఏదైనా మంచి పని చెయ్యాలని తలచారు. వారేం చేసారంటే.?

సాహిల్ అగర్వాల్ మరియు సౌమ్య గార్గ్ అనే దంపతులు తమ పెళ్లి గుర్తుండిపోయేలా ఉండాలని భావించారు. తమ పెళ్ళికి డబ్బు రూపకంగా వచ్చిన డబ్బుతో ప్రజలకు ఉపయోగపడే పని చెయ్యాలని అనుకున్నారు. వారికి స్నేహితులు మరియు బంధువులు ఇచ్చిన బహుమతుల విలువ 10 లక్షలు. వీరు ఈ డబ్బుని ఏదైనా సమాజం కోసం మంచి చేయాలి అని అనుకునే సంస్ధ లేదా వ్యక్తికి ఫండ్ రూపకంగా ఇవ్వాలని భావిస్తున్నారు. దీని కోసం వీరు ఒక వెబ్ సైట్ కూడా ప్రారంభించారు. ఇప్పటికి వీరికి చాలానే ఐడియాలు కూడా ఇచ్చారు. ఈ జంట ఒక అయిదు లేదా పది ఐడియాలకు 1 – 2 లక్షల వరకు ఫండ్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆర్‌.ఓ వాటర్‌ ఫిల్టర్‌ పెట్టించమని ఒక్కరు చెప్పగా పెళ్ళికి అవసరం అయ్యే పర్యావరణ అనుకూలమైన, సేంద్రీయ మరియు బయోడిగ్రేడబుల్ వస్తువులు తయారు చేసేందుకు సహాయపడమని ఒకరు సలహా ఇచ్చారు.

-

సౌమ్య మరియు సాహిల్ ఏడు నెలల క్రితం ఢిల్లీలో పని సమయంలో కలుసుకున్నారు. వారి ఆలోచనలు ఒక్కే రకంగా ఉండడంతో వారి స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. సాహిల్ ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి మరియు విజన్ భారతదేశం ఫౌండేషన్ సహ స్థాపకుడు కూడా.