పుట్టిన రోజు ప్రత్యేకత ఏంటి? ఎందుకు జరుపుకోవాలి?

ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టినరోజు అత్యంత ప్రధానమైనది.మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించే ఏ వ్యక్తి అయిన నేను పుట్టిన రోజును చేసుకోను అనే మాటను ఎప్పుడు అనకూడదు.

 Specility Of Birthday In Hindu Rituals-TeluguStop.com

జీవితంలో ప్రతి ఒక్కరికి ఓ లక్ష్యం ఉంటుంది.ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దానికి శరీరం అవసరం కాబట్టి ఆ పరమేశ్వరుడు పుట్టుకతోనే మనకు శరీరాన్ని గొప్ప వరంగా ప్రసాదించాడు.

అందుకోసమే మనం పుట్టిన రోజున ఒక పండుగలాగా నిర్వహించుకోవాలి.

 Specility Of Birthday In Hindu Rituals-పుట్టిన రోజు ప్రత్యేకత ఏంటి ఎందుకు జరుపుకోవాలి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రతి వ్యక్తికి కేవలం ఒక పుట్టిన రోజు మాత్రమే ఉంటుంది.

కానీ ఒక అమ్మకు మాత్రం తనకు ఎంత మంది సంతానం ఉంటే అన్ని పుట్టిన రోజులతో పాటు తన పుట్టిన రోజు కూడా ఉంటుంది.తను నవమాసాలు మోసి పురిటి నొప్పులు భరించి మనల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసేటప్పుడు తన ప్రాణాలను పణంగా పెట్టి మనకు జన్మనిస్తుంది.

అలా మనకు జన్మఇచ్చిన అమ్మకు మన పుట్టిన రోజున తనకి కూడా పుట్టినరోజు గా భావించి వేడుకగా జరపాలి.

అందుకే ప్రతి బిడ్డ పుట్టిన రోజున తన తల్లికి ఒక కొత్త చీర సమర్పించి పాదాభివందనం చేసుకున్న తర్వాత తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలి.

అది మనకు జన్మనిచ్చిన తల్లికి మనం ఇచ్చే గౌరవ పూర్వకమైన మర్యాద.అమ్మ మనల్ని సృష్టించి ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది కాబట్టి ఆమె మనకు ఒక బ్రహ్మ, ఆమె రక్తాన్ని మనకు పాలుగా మార్చి మన ఆకలి తీరుస్తుంది.

తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేదాకా గర్భసంచిలో చీకటిలో ఉన్న ఆ బిడ్డకు ఒక్కసారిగా ఈ ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.అందుకే అమ్మను బ్రహ్మ ,విష్ణు, పరమేశ్వరుల త్రిమూర్తుల స్వరూపమే అమ్మ అని భావిస్తారు.

అమ్మతనం కేవలం స్త్రీ నుంచి లభిస్తుంది కాబట్టి అమ్మను మాతృదేవోభవ గా భావించి నమస్కరిస్తారు.ఎవరైతే ఆడతనంలో అమ్మతనాన్ని చూసి గౌరవిస్తారు అలాంటివారికి దీర్ఘాయుష్షును పొందుతారని వేదపండితులు తెలియజేస్తున్నారు.

#SpecilityOf #Hindu Rituals #Hindu Believes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL