పుచ్చగింజలు గురించి ఈ విషయం తెలిస్తే అసలు పాడేయకుండా తింటారు     2018-05-22   02:21:33  IST  Lakshmi P

వేసవికాలంలో ఎండలో పుచ్చకాయ ముక్కలను తింటే ఆ అనుభూతే వేరు. పుచ్చకాయ ముక్కలను తినటం వలన వేసవిలో కలిగే దాహం బాగా తీరుతుంది. అయితే మనం పుచ్చకాయ ముక్కలను తిని గింజలను పాడేస్తూ ఉంటాం. అయితే గింజలలో అనేక పోషక విలువలు ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే గింజలను పాడేయకుండా తినటం అలవాటు చేసుకుంటారు. పుచ్చకాయ గింజల్లో విటమిన్స్ తో పాటు మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాపర్ జింక్, మాంగనీస్ సమృద్ధిగా ఉంటాయి.

ఈ గింజలలో ఉండే అమైనోఆసిడ్స్ రక్త నాళాలను వెడల్పు చేసి రక్త ప్రసరణ బాగా జరిగేలా చేసి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అంతేకాక రోగనిరోధక శక్తిని పెంచటానికి కూడా దోహదం చేస్తుంది.

ఈ గింజలలో ఐరన్ సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో క్యాలరీలను శక్తిగా మార్చటంలో సహాయపడుతుంది.