పాదాల మంట తగ్గటానికి ఇంటి చిట్కాలు  

పాదాల మంటలు అనేవి ఏ వయస్సు వారిని అయినా భాదిస్తాయి.అయితే 50 సంవత్సరాల వయస్సు వారిలో ఎక్కువగా వస్తాయి.

పాదాల మంటలకు అనేక కారణాలు ఉంటాయి.అవి సాదారణంగాను మరియు తీవ్రంగాను ఉంటాయి.

పాదాల మంట తగ్గటానికి ఇంటి చిట్కాలు-Telugu Health-Telugu Tollywood Photo Image

సాదారణంగా ఈ సమస్య పాదాల యొక్క నరాల బలహీనత, నష్టం మరియు అలసట వల్ల ఏర్పడుతుంది.అలాగే ఎక్కువసేపు నిలబడటం వలన కూడా ఈ సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కొన్ని సార్లు పాదాల మంట ప్రారంభం అయినప్పుడు వాపు, చర్మం పొట్టు రాలిపోవటం, చర్మం రంగు మారటం, ఎరుపుదనం వంటివి ఉంటాయి.పాదాల మంట తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ సలహాని తప్పనిసరిగా తీసుకోవాలి.అయితే ఈ సమస్య ప్రాధమిక దశలో ఉంటే మాత్రం సహజ నివారణలతో ఇంట్లోనే నివారించవచ్చు.

1.వేడి మరియు చల్లని నీటిని కాపడం పెట్టటం

పాదాల వద్ద రక్త ప్రసరణ పెరిగితే పాదాల మంట తగ్గుతుంది.వ్యాయామం అనేది మొత్తం శరీరం అంతా రక్త ప్రసరణ విస్తరించేందుకు సహాయపడుతుంది.

అయితే,కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో రక్త ప్రసరణ విస్తరించేందుకు వేడి మరియు చల్లని నీటిని కాపడం పెట్టటం చేయాలి.ఒక బకెట్ లో చాలా వేడి నీరు, మరో బకెట్ లో చల్లని నీటిని తీసుకోవాలి.

వేడినీటిలో ఒకసారి,మరొక సారి చల్లని నీటిలో పాదాలను మారుస్తూ పెట్టాలి.ఈ విధంగా 15 నిమిషాల పాటు చేయాలి.

ఈ పద్దతిని ప్రతి రోజు చేస్తే పాదముల రక్త ప్రసరణ పెరగటానికి సహాయపడుతుంది.అంతేకాక పాదాల నొప్పి మరియు పాదాల మంటను సమర్ధవంతంగా నయం చేస్తుంది.2.ఆవాల నూనె మరియు ఉప్పు

పాదాల మంటను తగ్గించటానికి మరొక సమర్ధవంతమైన ఇంటి నివారణగా ఆవాల నూనె మరియు ఉప్పు అని చెప్పవచ్చు.

ఒక కంటైనర్ లో ఆవాల నూనె మరియు ఉప్పు వేసి బాగా కలిపి పాదాలకు రాసి మసాజ్ చేయాలి.ఉప్పు ఘర్షణ మరియు ఆవాల నూనె మర్దన పాదాల యొక్క నరాలను ఉత్తేజితం చేస్తాయి.

ప్రతి రోజు ఈ మసాజ్ ని 15 నిమిషాల పాటు చేసి, ఆ తర్వాత వేడి నీటితో శుభ్రం చేయాలి.మంచి పలితాన్ని పొందటానికి పాదాలను శుభ్రం చేసుకున్న వెంటనే కాటన్ సాక్స్ వేసుకోవాలి.

3.వేడి పసుపు పేస్ట్

వేడి పసుపు పేస్ట్ పాదాల మంటను తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఒక గిన్నెలో పసుపు వేసి పేస్ట్ చేయటానికి నీటిని కలపాలి.ఈ పేస్ట్ ని పొయ్యి మీద పెట్టి కొంచెం సేపు వేడి చేయాలి.

ఈ పేస్ట్ ని పాదాలకు ఒక మందపాటి పొరగా వేసి ఆరేవరకు అలానే ఉంచాలి.ఆ తర్వాత గోరువెచ్చని నీటితో పాదాలను శుభ్రం చేసుకోవాలి.

ఈ పేస్ట్ ని పాదాలకు రాసే ముందు భరించగలిగే వేడి ఉండేలా చూసుకోవాలి.ఈ పేస్ట్ ని పాదాలకు క్రమం తప్పకుండా రాస్తే పాదాలకు రక్త ప్రసరణ పెంచటం మరియు పాదాల మంట తగ్గటానికి సమర్ధవంతంగా పనిచేస్తుంది.

4.అల్లం మరియు పొద్దుతిరుగుడు నూనె

అల్లం శరీరంలో రక్త ప్రసరణ పెంచటానికి అద్భుతమైన ఉత్పత్తి అని చెప్పవచ్చు.

అల్లం రసంలో పొద్దుతిరుగుడు నూనెను కలిపి పాదాలకు మసాజ్ చేయాలి.ఈ ప్రక్రియలో పాదాలకు వేడి పుట్టించి రక్త ప్రసరణ పెరిగేలా అల్లం సహాయపడుతుంది.

రక్త ప్రసరణ ఎక్కువగా జరిగి మరింత ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది.అందువలన పాదాల మంటకు సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test