పశ్చిమలో జగన్ పక్కా ప్లాన్..సర్వం సిద్దం       2018-06-03   00:55:43  IST  Bhanu C

జగన్ మోహన్ రెడ్డి కి గత ఎన్నికల్లో ఒకరకంగా అధికారాన్ని దూరం వాటిలో ఒక కారణం పశ్చిమగోదావరి జిల్లానే అని చెప్పాలి ఎందుకంటే గత ఎన్నికల్లో ఒక్క సీటు అంటే ఒక్క సీటు కూడా పశ్చిమ నుంచీ రాకపోవడంతో వైసీపి సీఎం ఫీటాన్ని సాధించలేక పోయింది..అయితే ఈ సారి ఎట్టి పరిస్థిత్తులలో అయినా సరే పశ్చిమలో చక్రం తిప్పాలని పక్క వ్యుహాలని సిద్దం చేసుకుంటున్నాడు జగన్ మోహన్ రెడ్డి ఆదిశగా చేక చేకా అడుగులు వేస్తూ దూసుకు వెళ్తున్నాడు.. వివరాలలోకి వెళ్తే..

ప్రజా సంకల్పయాత్ర పేరుతో జగన్‌ చేస్తున్న పాదయాత్ర ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో పూర్తయి ప్రస్తుతానికి పశ్చిమలో నడుస్తోంది..ఈ యాత్రకి ఆయా వర్గాల నుంచి భారీ స్పందన వస్తోంది..ఈ యాత్రపై ప్రజల నుంచీ మొదలు రాజకీయ సమీకరణాలలో సైతం వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి..అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు కూడా రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఇతర పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానిస్తున్నారు.

అయితే పశ్చిమలో రాజకీయ దురండురుడు అయిన హరిరామ జోగయ్యతో మంతనాలు జరిపిన జగన్ తన కుమారుడు సూర్య ప్రకాష్ కి ఆచంట లేదా నరసాపురం నుంచీ సీటు ఇస్తానని చెప్పాడట దాంతో డెల్టాలో కొంచం వైసీపికి మంచి పట్టు దొరుకుతుందనేది వైసీపి అభిప్రాయం..అయితే అటు మెత్త ప్రాంతం నుంచీ కూడా ఏజెన్సీ వైపు నుంచీ ఎంతో పట్టు ఉన్న నేత కరాటం రామబాబు ని సైతం పార్టీ లోకి ఆహ్వానించారట..పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సముచిత స్థానం ఇస్తామని తెలిపారట.

ఇదిలాఉంటే పాలకొల్లు నుంచీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వైసీపిలోకి వస్తారని తెస్తోంది..అయితే ఆయనకీ టిక్కెట్టు ఇవ్వకపోయినా సరే ఆయనకీ ఉన్న చరిష్మా పాలకొల్లులో ఓటర్ ని తమవైపు తిప్పుకునేలా చేయగల సత్తా ఉంది..అయితే ఇప్పుడు బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు చెడటంతో నేరుగా బీజేపీ బరిలోకి దిగితే పాలకొల్లు నియోజకవర్గం నుంచి బాబ్జీ గెలుపు ఖాయమని కమలనాథులు చెబుతున్నారు..జగన్ అనుకున్నవి అనుకున్నట్టుగా వచ్చే ఎన్నికల్లో జగన్ చక్రం తిప్పడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.