పవన్ “నోటి దూల” తీర్చేస్తున్న యూత్..       2018-06-08   01:49:20  IST  Bhanu C

పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు..ఆ ఆవేశంలో నోటికి ఎదోస్తే అది మాట్లాడేస్తాడు ఆ ఆవేశం ఎన్నో సార్లు ఎన్నో అనర్దాలకి దారి తీసింది అయితే తాజాగా ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ పై , కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ పొలిటికల్ హీటు పెచుకుంటూ పోతున్నాడు అయితే ఈ క్రమంలోనే మాడుగల నియోజకవర్గం చీడికాడ మండలంలో పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడిన మాటల యువకులలో తీవ్రమైన ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి..వివరాలలోకి వెళ్తే..

-

అసలు పవన్ కళ్యాణ్ తో పొత్తు కావాలని రాజకీయ పార్టీలు కొరుకొవడానికి ప్రధానమైన కారణం ఒక్కటే అతడి వెనుక యువత అధిక సంఖ్యలో ఉంటారని మరియు కాపుల ఓటు బ్యాంక్ పడుతుందని..చంద్రబాబు జట్టు కట్టినా లేక జగన్ జట్టు కట్టాలని అనుకున్నా సరే కేవలం యూత్ లో ఉన్న ఫాలోయింగ్ చూసుకునే అయితే ఇప్పుడు తన దుందుడుకు చర్యలవలన యూత్ ఓట్లు మొత్త దూరం అయ్యేలా ఉన్నాయి..

మాడుగల ప్రాంతంలో ఉపాది అవకాశాలు లేకపోవడం వలన యువకులు గంజాయి రవాణాకు దిగుతున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాక రేపుతున్నాయి.. పవన్ చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని యువత ఆవేదన వ్యక్తం చేశారు..కేవలం కొంతమంది యువకులు చేసిన పనికి గ్రామంలోని అందరికీ ఎలా వర్తిస్తుంది అంటూ మండిపడుతున్నారు..మాపై గంజాయి మచ్చ ఎలా వేస్తారు అంటూ యువకులు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు.

అయితే జనసేనాని పర్యటించే ప్రాంతం యొక్క సమగ్ర నివేదికని పవ చుట్టూ ఉండే కోటరీ ఎంతో భాద్యతగా ఇవ్వాలని లేకపొతే యువత మొత్తం జనసేనని వెలి వేసేవిధంగా మారిపోతుందని హెచ్చరించారు..ఈ విషయాన్ని పవన్ తెలుసుకుని తన తప్పుని సరిదిద్దుకోవాల్సిన అవసరం వుందని మాడుగుల యువత అభిప్రాయం వ్యక్తం చేశారు…కాగా ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ కూడా జనసేన నుంచీ రాకపోవడంతో యువత జనసేన పార్టీ పై తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.