పవన్ కోసం ఆ “ఛానెల్ ”.....“భారీ డీల్”   Pawan Kalyan Big Deal With Telugu News Channel     2018-03-22   23:18:30  IST  Bhanu C

పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ లో తానేమిటో గుంటూరు సభ ద్వారా తెలియచేశాడు..గత ఎన్నికల్లో ఏ పార్టీకి అయితే ఓట్లు వేయమని అడిగాడో ఈ సారి అదే పార్టీ కి ఓట్లు వేయకండి అంటూ ప్రచారం మొదలు పెట్టనున్నాడు..ప్రత్యేక హోదా అనేది తప్పకుండా ఏపీ కి అవసరమైన టానిక్కు అంటూ చెప్పుకొస్తున్న పవన్ కళ్యాణ్ తానూ దూకుడు రాజకీయాలు చేయబోతున్నట్లుగా చెప్పకనే చెప్తున్నారు..ఏకంగా లోకేష్ నే టార్గెట్ చేస్తూ చంద్రబాబు కి లోకేష్ అవినీతి తెలియదా అని అడిగిన ప్రశ్న ఏపీ రాజకీయాలలో కలకలం రేపుతోంది..ఏపీలో వైసీపితో జట్టు కడుతాడా లేదా అనేది పక్కన పెడితే కేంద్రంలో బీజేపి తో కలిసి ఉంటాడు అని మాత్రం అర్థం అవుతోంది..

ఇదిలాఉంటే ఏపీలో బీజేపి ప్రధాన టార్గెట్ చంద్రబాబు..ఎందుకంటే ఎదో రకంగా అయినా బయపెట్టి తమ వైపుకి చంద్రబాబు ని తిప్పుకోవాలని అనుకున్నాయి కానీ ఎంతో ఆత్మాభిమానం పౌరుషం ఉన్న వ్యక్తిగా చంద్రబాబు లొంగలేదు అందుకే పవన్ ని ముందు పెట్టి పవన్ తో చంద్రబాబు పై మైండ్ గేమ్ ఆడిస్తోంది బీజేపి..అయితే కేంద్రం చంద్రబాబు ని ,ఎపీని మోసం చేసింది ఈ విషయంలో చంద్రబాబు ఎంతో పోరాటం చేస్తున్నారు అంటూ సానుకూలంగా చంద్రబు సపోర్ట్ మీడియా పడే పడే టెలికాస్ట్ చేస్తూ చంద్రబాబు ని సేఫ్ జోన్ లో పడేస్తోంది..

అదేవిధంగా జగన్ కి కూడా తన మీడియా నుంచీ ఫుల్ సపోర్ట్ ఉంది ఎప్పుడు..పేపర్ కూడా ఉంది అంతేకాదు మరొక పేపర్ లో కూడా జగన్ భారీ పెట్టుబడులు పెట్టారు అని టాక్ కూడా ఉంది దాంతో జగన్ పబ్లిసిటీకి వచ్చిన డోఖా ఏమీ లేదు అయితే పవన్ కళ్యాణ్ కి మాత్రం మీడియా సపోర్ట్ చాలా తక్కువ..అంతేకాదు ఏపీలో బీజేపీ గోడు, ప‌వ‌న్ మాట ప‌ట్టించుకునే వారు ఎవ‌రు ? అందుకే ప‌వ‌న్ ఓ ఛానెల్‌ను లీజుకు తీసుకునే ప‌నిలో ఉన్నాడ‌ని టాక్ వినిపిస్తోంది…ఇటీవ‌ల ప‌వ‌న్ బెజ‌వాడ‌ వెళ్ళినప్పుడు ఆ చానెల్ కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇవ్వడం తో ఈ సందేహం అందరికీ కలిగింది.

ప‌వ‌న్ ఆ ఒక్క ఛానెల్‌తోనే ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడాడు అంటూ అనేక సందేహాలు వెలిబుచ్చారు..అయితే సదరు ఛానెల్ వాళ్ళకి ఆర్ధికంగా ఇప్పుడు సప్పోర్ట్ కూడా అవసరం దాంతో పవన్ కళ్యాణ్ ఈ ఛానెల్ తో భారీ డీల్ కుదుర్చుకున్నాడని టాక్ వినిపిస్తోంది..టాలీవుడ్ లో ఉన్న ఓ కీలకమైన వ్యక్తి ఈ డీల్ సెట్ చేసినట్లుగా తెలుస్తోంది..ఇదిలాఉంటే ఈ విషయం తెలిసిన నేట్లిజను మాత్రం ఇప్పటి వరకూ ఉన్న సొంత డబ్బా చానెల్స్ సరిపోక మళ్ళీ జనాలమీదకి మరొక ఛానెల్ వస్తోందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.