పవన్ కళ్యాణ్ పై “ముద్రగడ” షాకింగ్ కామెంట్స్..  

గతకొంత కాలంగా చాలా సైలెంట్ గా ఉన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మళ్ళీ ఈ మధ్య వార్తలలో నిలిచారు..తన కొడుకుకి ఎమ్మెల్యే సీటు కోసం వైసీపి అధినేత జగన్ తో కలిసి మంతనాలు చేస్తున్నారు , ముద్రగడ ఉద్యమం తన కొడుక్కి ఎమ్మెల్యే సీటు కోసమే అంటూ వార్తలు వచ్చాయి అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించని ముద్రగడ తాజాగా పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు..పవన్ రెండు పడవల సిద్దాంతం పాటిస్తే ఘోరంగా దెబ్బ తింటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు..అయితే ఈ వ్యాఖ్యలు ముద్రగడ ఎందుకు చేశారు అసలేం జరిగిందంటే..

ఈరోజు మీడియాతో మాట్లాడిన ముద్రగడ జనసేన పార్టీలో నేను చేరుతాను అంటూ వస్తున్నా వార్తల్లో నిజం లేదని తెలిపారు..

-


పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో నెగ్గాలి అంటే ముందు రెండు పడవల మీద కాళ్ళు పెట్టకుండా ఉండాలని హితపు పలికారు..ఎన్టీఆర్ మాత్రమే ఏపీ చరిత్రలో సినిమాల నుంచీ వచ్చి సక్సెస్ అయ్యారని మిగతా వారికి ఎవరికీ కూడా ఇప్పుడు ఆ అవకాశం లేదని అన్నారు..అయితే ఎన్టీఆర్ లా పవన్ నెగ్గాలంటే మాత్రం ప్రజలలో తిరిగి పట్టు సంపాదించాలని అన్నారు.. ముద్రగడ

అంతేకాదు పవన్ కళ్యాణ్ ఒక మహా వృక్షము నీడలో ఉన్నాడు..ఆయన బి.జె.పి.ని వదిలి బయటకు వస్తే గాని ఎదిగే అవకాశం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు..తానూ ఏ పార్టీ కి కూడా మద్దతు ఇవ్వను అని తెలిపారు.. తన అభిప్రాయాలను జనసేన నేత రాఘవయ్యతో చర్చించాను అయితే మాట్లాడితేనే జనసేనలో చేరి పోయినట్టేనా అంటూ ప్రశ్నించారు..కాపులకి రిజర్వేషన్లు ఇవ్వాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన ముద్రగడ కొంతకాలంగా సైలెంట్ గా ఉండి ఇప్పుడు మళ్ళీ పవన్ పై కామెంట్స్ చేయడం ద్వారా మళ్ళీ ఏపీ ప్రజల దృష్టి తన వైపుకు తిప్పుకోవాలని ట్రై చేస్తున్నారు..

అయితే ఎప్పుడూ చంద్రబాబు పై నిపులు చెరిగే ముద్రగడ , పవన్ కళ్యాణ్ పై విమర్శలు చెయ్యటం, ఇప్పుడు ఆసక్తిగా మారింది..పవన్ కి కూడా కాపు సామాజికవర్గ సపోర్ట్ మెండుగానే ఉంది దానికి తోడు ఎన్నికల సమయంలో తన మెగా ఫ్యామిలీ మొత్తం ప్రచారానికి వస్తుంది అనడంలో సందేహం లేదు..అయితే ముద్రగడని జగనే తెరవెనుక ఉండి నడిపిస్తున్నారు అంటూ ఎన్నో ఆరోపణలు ఉన్నాయి కూడా..అయితే ముదస్తూ చర్యలుగానే పవన్ కి కాపుల మద్దతు ఎంత తగ్గిస్తే అంత మంచిది అనే ఉద్దేశ్యంతో జగనే పవన్ పై కామెంట్స్ చేయిస్తున్నాడు అంటున్నారు విశ్లేషకులు సైతం..