పవన్ కళ్యాణ్ ని చంపినా చంపేస్తారు..పోసాని షాకింగ్ కామెంట్స్   Actor Posani Shocking Comments On Pawan Kalyan     2018-03-22   06:37:35  IST  Bhanu C

టిడిపి ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ టాలీవుడ్ పై వేసిన బాంబు ఏ రేంజ్ లో పెలిందో వేరే చెప్పనవసరం లేదు టాలీవుడ్ నటీనటులు హీరోలు అందరినీ నుంచో పెట్టి కదిగేశారు..ఏసీ గదుల్లో కులుకుతారు..హీరోయిన్స్ వెనకాల పడుతారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి అయితే ఈ విషయంపై పోసాని కూడా తీవ్రస్థాయిలో స్పందించారు..టిడిపి నేతలని చంద్రబాబు ని పోసాని ఫుడ్ బాల్ ఆడుకున్నారు..అయితే ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పోసాని పవన్ కళ్యాణ్ భవిష్యత్తు పై సంచలన వ్యఖ్యలుక్ చేశారు..ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీ మొదలు రాజకీయ వర్గాలలో తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్నాయి..

గుంటూరు సభలో గర్జించిన పవన్ కళ్యాణ్ హోదా కోసం పోరాడాలని…హోదా మన హక్కు అంటూ చెప్పిన మాటలు అందరికీ గుర్తు ఉండే ఉంటాయి..అయితే ఆ సమయంలో హోదా కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తాను అని సంఘీభావం తెలిపారు.. అయితే ఈ విషయంపై పోసాని స్పందిచారు…పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు..ఇంతకీ ఏమన్నారంటే..పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం దీక్షకు దిగితే తాను పూర్తి మద్దతు ఇస్తా.. కాని ఆయన దీక్షకు కూర్చోవాలని తాను కోరుకోవడం లేదన్నారు. ఎందుకంటే జనసేన పార్టీ పెట్టారు కానీ తానేమి ఎమ్మెల్యే కాదు మంత్రి కాదు ఎటువంటి హోదా పొందలేదు అలాంటప్పుడు ఎందుకు దీక్ష చేయాలి లబ్ది పొందిన వాళ్ళు చేయాలి అంటూ ఫైర్ అయ్యారు..

వేల వేల కోట్లు దోచుకున్న మంత్రులు,ఎమ్మెల్యేలు హోదా కోసం దీక్ష చేయాలి..అంతేకాని పవన్ కళ్యాణ్ దీక్ష చేయాలనీ అనుకోవడం మంచిది కాదని అన్నారు..అయితే పవన్ కళ్యాణ్ కి చెప్తూ పవన నువ్వు ఒక వేళ దీక్ష చేసినా సరే కుట్ర పన్ని నిన్ను చంపేస్తారు..అంతకి కూడా తెగించేవారు ఉన్నారు అంటూ సంచలన వ్యఖ్యలుక్ చేశారు..పోసాని…ఈ వ్యాఖ్యలే రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చలకి దారి తీస్తున్నాయి..అసలు పోసాని ఆ మాట ఎందుకు అన్నారు అంటూ అందోళనకి లోనవుతున్నారు అభిమానులు..