పవన్‌ వచ్చినంత మాత్రాన పని కాదని తేలిపోయింది  

  • పవన్‌ కళ్యాణ్‌ తమ సినిమాల ఆడియో వేడుకలకు మరియు ప్రీ రిలీజ్‌ ఫంక్షన్స్‌కు రావాలని యువ హీరోలు ఎక్కువగా కోరుకుంటారు. అప్పట్లో నితిన్‌ హీరోగా నటించిన ‘ఇష్క్‌’ చిత్రం ఆడియో వేడుకకు హాజరు అయ్యాడు పవన్‌. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంతో పవన్‌ సినిమా ఫంక్షన్‌కు వస్తే తప్పకుండా సక్సెస్‌ అంటూ అంతా నమ్మకం పెట్టుకున్నారు. అప్పటి నుండి పలు ఫంక్షన్స్‌కు పవన్‌ గెస్ట్‌గా హాజరు అయ్యాడు. పలు సినిమాలు అందులో సక్సెస్‌ అయ్యాయి. కాని ఇటీవల పవన్‌ గెస్ట్‌గా హాజరు అయిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.

  • -

  • పవన్‌ తన అన్న నాగబాబు నిర్మించిన ‘నా పేరు సూర్య’ చిత్రం వేడుకలో పాల్గొన్నాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించాలని, తన అన్నకు భారీ లాభాలను తెచ్చి పెట్టాలని కోరుకున్నాడు. కాని పవన్‌ కోరిక నెరవేరలేదు. ‘నా పేరు సూర్య’ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. పవన్‌ కళ్యాణ్‌ గెస్ట్‌గా వచ్చిన కూడా ఆ సినిమా ఆశించిన రేంజ్‌లో కలెక్షన్స్‌ను రాబట్టడంలో విఫలం అయ్యింది. తాజాగా నేల టికెట్టు చిత్రం కోసం కూడా పవన్‌ కళ్యాణ్‌ వచ్చాడు.

  • ‘నేలటిక్కెట్టు’ చిత్ర నిర్మాత రామ్‌కు పవన్‌ అత్యంత ఆప్తుడు. ఆ కారణంగానే పవన్‌ కళ్యాణ్‌ ఆ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో పాల్గొన్నాడు. పవన్‌ గెస్ట్‌గా రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. కాని సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. ఏమాత్రం మెప్పించని కథ, కథనాలతో దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ తెరకెక్కించాడు. సినిమాలో మ్యాటర్‌ లేకున్నా కూడా పవన్‌ వచ్చాడు కనుక సినిమా సక్సెస్‌ అంటూ చెప్పుకోవడం అవివేకం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

  • పవన్‌ కళ్యాణ్‌ సినిమాలకు దూరం అయినా కూడా సినిమా వేడుకల్లో ఈమద్య ఎక్కువగా పాల్గొంటున్నాడు. ఆయన తన సన్నిహితులు అనుకున్న వారి సినిమాల వేడుకల్లో పాల్గొంటున్నాడు. వరుసగా సినిమా వేడుకల్లో పాల్గొంటున్న పవన్‌ సినిమాల సక్సెస్‌ విషయంలో తన క్రేజ్‌ను చూపించడంలో విఫలం అవుతున్నాడు. పవన్‌ వచ్చినంత మాత్రాన సినిమా సక్సెస్‌ కాదని మరోసారి నిరూపితం అయ్యింది. రాజకీయాలతో బిజీగా ఉంటున్న పవన్‌ కళ్యాణ్‌ అప్పుడప్పుడు సినిమా వేడుకల్లో కనిపిస్తూ ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు.