పవన్‌ పిలవకున్నా వీళ్లు రెడీ!       2018-06-07   00:58:56  IST  Raghu V

మెగా ఫ్యామిలీలో గతంలో విభేదాలు ఉన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. అయితే ప్రస్తుతం మాత్రం మెగా ఫ్యామిలీ అంతా కలిసి కట్టుగా ఉంది. ముఖ్యంగా మెగా బ్రదర్స్‌ చిరంజీవి, నాగబాబు, పవన్‌లు సందర్బానుసారంగా కలుస్తూనే ఉన్నారు. పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీకి ఇప్పటికే నాగబాబు మద్దతు పలుకగా, చిరంజీవి కూడా బహిరంగంగా కాకున్నా అంతర్గంతంగా మద్దతు పలుకుతున్నాడు. గతంలో ప్రజారాజ్యంకు జరిగిన నష్టం జరగకుండా జాగ్రత్త పడేందుకు మెగా ఫ్యామిలీ అంతా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీ కోసం తన సర్వంను దార పోస్తున్నాడు అని, ఆయనకు తాము మద్దతుగా ఉన్నామంటూ నాగబాబు ఇటీవలే చెప్పుకొచ్చాడు.

నాగబాబుతో పాటు రామ్‌ చరణ్‌ కూడా తాజాగా బాబాయి ఆహ్వానిస్తే జనసేన పార్టీ కోసం ఏం చేసేందుకు అయినా కూడా సిద్దం అంటూ ప్రకటించాడు. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ ప్రజా యాత్రలో ఉన్నాడు. ఆయన వచ్చే ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం ఖాయం అని తేలిపోయింది. ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌ ప్రజల్లో రాజకీయ నాయకుడిగా ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. 2019 ఎన్నికల్లో పవన్‌ క్రియాశీలకంగా వ్యవహరించడం ఖాయం అని తేలిపోయింది. పవన్‌ను సీఎంగా చూడాలని మెగా ఫ్యాన్స్‌ చాలా కోరుకుంటున్నారు.

మెగా ఫ్యాన్స్‌ కోరిక తీర్చేందుకు మెగా హీరోలు క్యూ కట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. తాను ఎవరిని ప్రత్యేకంగా పార్టీ కోసం పిలవను అంటూ ప్రకటించిన పవన్‌ కళ్యాణ్‌ ఫ్యామిలీ నుండి తనకు మద్దతుగా వచ్చే వారిని కాదనను అంటూ క్లారిటీ ఇచ్చాడు. దాంతో పవన్‌ కళ్యాణ్‌కు మద్దతుగా నిలిచేందుకు మెగా హీరోలు అంతా కూడా సిద్దం అవుతున్నారు. త్వరలోనే జిల్లాల్లో మెగా హీరోలు అంతా కలిసి జనసేనకు మద్దతుగా నిలువనున్నారు. పవన్‌ అనుమతి కోసం వీరు ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇటీవల మెగా హీరోల మీటింగ్‌ జరిగింది. రహస్యంగా జరిగిన ఆ మీటింగ్‌లో మెగా హీరోలు పవన్‌ కళ్యాణ్‌కు మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఆ మద్దతు ఎలా ఉండాలి అనే విషయంపై కూడా చర్చ జరిగింది. ఎన్నికల సమయంలో పవన్‌కు పూర్తిగా మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ ఇలా అందరు కూడా జనసేనకు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. జనసేనకు మెగా హీరోల మద్దతు ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి.