పరగడుపున కాళీ కడుపుతో ఈ 5 ఆహారాలు అస్సలు తీసుకోవద్దు.! టీ, కాఫీ కూడా.! ఎందుకో తెలుసా.?       2018-05-20   02:25:12  IST  Lakshmi P

ఉదయం నిద్రలేడంతోనే టీ, కాఫీతో రోజును ప్రారంభించేవారు మనలో చాలా మంది ఉండి ఉంటారు . ఆ అలవాటున్న వారు వెంటనే మానేయండి. కాఫీ, టీలతో మైండ్ ఫ్రెష్ అవుతుంది అనుకుంటున్న వారికి తెలియని విషయం ఏంటంటే…పరగడపున తాగే ఈ టీ, కాఫీ ల వల్ల వారి హర్మొన్లలో అసమతుల్యత ఏర్పడి…తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారట. కాఫీ, టీ లే కాదు….ఖాళీ కడపున తీసుకోకూడని కొన్ని పదార్థాల లిస్ట్ ఇక్కడ అందించాం…వీటిని పరగడుపున తీసుకుంటే ఎటువంటి అనారోగ్యాలు వస్తాయో ఆ వివరాలు కూడా మీకోసం.

1. సోడా, కూల్ డ్రింక్స్:

ఖాళీ కడుపుతో…. PH విలువ ఎక్కువగా ఉండే సోడా, కూల్ డ్రింక్స్ ను తాగడం వల్ల పేగుల్లో ఇరిటేషన్ వచ్చి వాంతులు అయ్యే ప్రమాదం ఉంది.

2. టమాట:

పరగడుపున టమోట లు తినకూడదు…టమాటాల్లో ఉండే యాసిడ్స్ ఖాళీ కడుపులో చేరితే వికారం కలగడమే కాదు, పేగుల్లో మంట పుడుతుంది.

3. అరటిపండ్లు:

పరగడపున అరటిపండ్లు తీసుకోవడం వల్ల శరీరంలో ఉంటే మెగ్రీషియం లెవల్స్ అమాంతం పెరుగుతాయి. ఇది ఆరోగ్యరిత్యా ప్రమాదకరం.

4. ఆల్కాహాల్:

ఖాళీ కడుపుతో ఆల్కాహాల్ తాగడంతో శరీరంలోని జీర్ణ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. పొట్ట నొప్పి…అధిక బరువు లాంటి సమస్యలు తలెత్తుతాయి.

5. స్పైసీ ఫుడ్స్ :

అల్సర్ రావడానికి ప్రధాన కారణం స్పైసీ ఫుడ్స్, ఇక ఇవి ఖాళీగా ఉన్న మన కడుపులో చేరితే అల్సర్ త్వరగా వచ్చే ప్రమాదం ఉంది.

అంతేకాదు జిమ్ కు ఖాళీ కడుపున వెళ్లకూడదు…అలా వెళితే కండరాలు విపరీతంగా అలసిపోయి భరించలేని నొప్పులు వస్తాయి. అందుకే జిమ్ కు వెళ్లే ముందు అరటిపండును మినహాయించి ఇతర ఏ ప్రూట్స్ ను అయిన తినాలి.