న్యూయార్క్ లో భారతీయత చాటిన “సిక్కు మహిళ”       2018-05-23   01:03:48  IST  Bhanu C

భారతీయ మహిళ న్యూయార్క్ పోలీసు విభాగంలో చరిత్ర సృష్టించింది..సిక్కు వర్గానికి చెందిన మహిళా మొదటి సారిగా న్యూయార్క్ పోలీసు విభాగంలో చేరనుంది..ఆమె పేరు గురుశోచ్‌ కౌర్‌ అయితే ఈ ఘనత సాధించిన తొలి సిక్కు మహిళగా గురుశోచ్‌ కౌర్‌ రికార్డు క్రియేట్ చేసింది.. అమెరికాకు వలసవెళ్ళిన వారిలో అత్యధికులు భారతీయులు కాగా భారతీయులలో అత్యధికులు సిక్కులు అమెరికాలో అధిక సంఖ్యలో ఉండటం గమనార్హం..


ఇదిలాఉంటే తలపాగా చుట్టుకుని మరీ న్యూయార్క్ పోలీసు విభాగంలో విధులు నిర్వరించనుంది న్యూయార్క్‌ సిటీ పోలీస్‌ అకాడమీలో గతవారం డిగ్రీ పూర్తి చేసుకున్న ఆమె పోలీసు సహాయక అధికారిణిగా న్యూయార్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరనున్నారు. ‘‘గురుశోచ్‌ కౌర్‌ను న్యూయార్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లోకి ఆహ్వానించటం తమకి ఎంతో గర్వంగా ఉందని ఆమె ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని సిక్క్‌ ఆఫీసర్స్‌ అసోషియేషన్‌ ట్విటర్‌ లో పేర్కొంది.


అయితే అమెరికా ప్రజలు సిక్కులని అర్థం చేసుకునే విధంగా “గురుశోచ్‌ కౌర్‌” తన విధులని నిర్వర్తించాలని “మినిష్టర్‌ ఆఫ్‌ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ అఫైర్స్‌” హరదీప్‌ సింగ్‌ పూరి కోరారు…ఎందుకంటే గతంలో అంటే 2010లో ఆయనకీ జరిగిన అవమానం ఈ మధ్యకాలంలో కెనడా మంత్రి నవదీప్‌ తెలియచేశారు.సిక్కులు ఎంతో శాంత స్వభావులని ఎవరు ఎటువంటి ఆపదలో ఉన్నా సరే సిక్కులు తమవంతు సాయం చేస్తారని కొనియాడారు హరదీప్… గురుశోచ్‌ కౌర్‌ కి శుభాకాంక్షలు తెలిపారు