నోటి దుర్వాసనకి శాశ్వత పరిష్కారం  

మనం తీసుకునే ఆహరంలో సరైన జాగ్రత్తలు పాటించకపోయినా , స్వీట్లు ,కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ అమితంగా తీసుకున్నా సరే నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. మనం తినే ఆహారం జీర్ణం అయినప్పుడు మాత్రమే ఎటువంటు రోగాలైనా మనకి రావు. కడుపులో ఆహరం జీర్ణం అవ్వకపోతే దుర్వాసన వచ్చేది ముందుగా నోటి నుంచి, చంకల్లో, మర్మావయవాల దగ్గర విపరీతమైన వాసన వస్తుంది..

-

మనం బయటకి వెళ్ళాలంటేనే ఒక్కోసారి బయపడే పరిస్థితి వస్తుంది.నోరు పొడిబారటం వల్ల‌ దంతాల నుంచి దుర్వాసన. నోట్లో ఉత్పత్తి అయ్యే లాలాజలం నోటిని శుభ్రం చేయటానికి ఉపయోగపడుతుంది.

దుర్వాసనకు దారితీసే పదార్థాలను కూడా శుభ్రం చేస్తుంది. నోరు పొడి బారడాన్ని వైద్య పరిభాషలో జీరోస్టోమియా అంటారు. దాని వలన లాలాజల ఉత్పత్తి తగ్గి దుర్వాసనకు దారి తీస్తుంది.

నోటి దుర్వాసన రాకుండా ఉండాలి అంటే సల్పర్ అధికంగా ఉన్న పదార్ధాలకి దూరంగా ఉండాలిదుర్వాసన రాకుండా ఉండాలి అంటే రోజుకి రెండు సార్లు దంతాలు శుభ్రం చేసుకోవాలి. దంతాల మ‌ధ్య పేరుకున్న పాచిని ఫ్లాసింగ్ వంటి ప‌ద్ద‌తుల ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు తొల‌గించుకోవాలి. ప్ర‌తి ఆరునెల‌ల‌కు ఓసారి దంత‌వైద్యుడి వ‌ద్ద‌కు వెళ్లి నోటిని ప‌రీక్షించుకోవాలి.

అంతేకాదు గానుగ పుల్ల తో దంతాలని శుభ్రం చేసుకోవడం వల్ల‌ గానుగలో ఉండే నునే లాంటి పదార్ధం చిగుళ్ళని గట్టి పరచడమే కాకుండా నోటి నుంచి దుర్వాసన రాకుండా కంట్రోల్ చేస్తుంది.