నేలటికెట్‌ ఫ్లాప్‌ అయ్యేలా ఉంది.. ఎందుకంటే!       2018-05-21   00:52:35  IST  Raghu V

రవితేజ, మాళవిక శర్మ జంటగా తెరకెక్కిన ‘నేలటికెట్‌’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. సోగ్గాడే చిన్ని నాయనో, రారండోయ్‌ వేడుక చూద్దాం చిత్రాల దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. కారణం దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ గత చిత్రాలు సక్సెస్‌ కావడమే. అయితే ప్రేక్షకులు మరియు సినీ విశ్లేషకులు మాత్రం ఈ సినిమాపై పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. కారణం రవితేజ గత చిత్రాలు మరియు తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌. నేలటికెట్‌ అంటూ దర్శకుడు మాస్‌ ఆడియన్స్‌ను టార్గెట్‌గా చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.

గతంతో పోల్చితే ప్రస్తుతం మాస్‌ ఆడియన్స్‌ పల్స్‌ చాలా మారింది. మాస్‌ అనగానే నాలుగు ఫైట్లు, నాలుగు పాటలు, ఒక ఐటెం సాంగ్‌, కామెడీ సీన్స్‌ ఉంటే సరిపోదు. ప్రస్తుత మాస్‌ ఆడియన్స్‌కు కథ, కథనంలో ట్విస్ట్‌లు, ఆసక్తికర ఎలిమెంట్స్‌, హీరోయిజంను సరిగా చూపించడంతో పాటు, హీరోయిన్‌కు మంచి ప్రాముఖ్యత ఉన్నట్లుగా చూపించాలి. అలా చూపించినట్లయితేనే ఈ జనరేషన్‌ ప్రేక్షకులు అంగీకరిస్తున్నారు. అలా కాదని మూసగా చిత్రాన్ని చేస్తాం, చూడండి అంటే గతంలో రవితేజ సినిమాలకు దక్కిన ఫలితం ఈ సినిమాకు దక్కుతుందని కొందరు అంచనా వేస్తున్నారు.

రవితేజ ‘టచ్‌ చేసి చూడు’ చిత్రం ఎలాంటి ఫలితం చవి చూసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విక్రమ్‌ సిరి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. అయితే ఆ సినిమాలో మాస్‌ ఎలిమెంట్స్‌ పుష్కలంగా ఉన్నాయి. కాని వాటిని చూపించడంలో దర్శకుడు విక్రమ్‌ సరైన మార్గంను ఎంచుకోలేక పోయాడు. విక్రమ్‌ సిరి మాదిరిగానే దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ ఈ చిత్రంను మూస దోరణిలో తెరకెక్కించి ఉంటాడని, అందుకే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేక పోవచ్చు అనే ఊహాగాణాలు వినిపిస్తున్నాయి.

‘నేలటికెట్‌’ చిత్రంలో రవితేజ లుక్‌ గత చిత్రాలతో పోల్చితే మారిపోయినట్లుగా ఉంది. ఈ చిత్రంలో పాత రవితేజ కనిపిస్తున్నాడు. ఇక హీరోయిన్‌ మాళవిక శర్మ అందాల ప్రదర్శణకు ఎలాంటి అడ్డు చెప్పనట్లుగా అనిపిస్తుంది. ఇక ఫైట్స్‌ విషయానికి వస్తే టీజర్‌ మరియు ట్రైలర్‌ల దుమ్ము రేపే విధంగా ఫైట్లు ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇంతగా మాస్‌ ఎలిమెంట్స్‌ ఉన్నా కూడా ప్రేక్షకులు ఆశించే కొత్తదనం ఈ చిత్రంలో కనిపించక పోవచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే ఈ సినిమా ఫలితం తారు మారు అయ్యే అవకాశం ఉంది. పూర్తిగా ఈ చిత్రం ఆకట్టుకోలేక పోవచ్చు అని మాత్రం మేము చెప్పడం లేదు. కాని కొందరు మాత్రం ఈ సినిమాపై భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. వారు సినిమా తప్పకుండా సూపర్‌ సక్సెస్‌ అవుతుందనే నమ్మకంను కలిగి ఉన్నారు.