నేను అందంగా ఉండనేమో అనిపిస్తుంది       2018-05-21   00:54:11  IST  Raghu V

మెగా ఫ్యామిలీ నుండి లెక్కకు మించి హీరోలు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. మెగా ఫ్యామిలీ నుండే కాకుండా సినిమా పరిశ్రమలోని పలు ఫ్యామిలీల నుండి హీరోలుగా ఎంతో మంది పరిచయం అయ్యారు. కాని హీరోయిన్స్‌గా పరిచయం అయిన వారిని వేల్ల మీద లెక్కించవచ్చు. మంచు లక్ష్మి నటిగా మంచు ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చింది. కాని ఆమె హీరోయిన్‌గా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. ఇటీవలే రాజశేఖర్‌ కూతురు శివాని హీరోయిన్‌గా పరిచయంకు రంగం సిద్దం అయ్యింది. ఈమె నటిస్తున్న సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక మెగా ఫ్యామిలీ నుండి వరుసగా వస్తున్న హీరోల మద్యలోంచి హీరోయిన్‌గా నిహారిక ఎంట్రీ ఇచ్చింది. తండ్రి ప్రోత్సాహంతో నిహారిక హీరోయిన్‌గా పరిచయం అయ్యింది.

ఆచి తూచి సినిమాు చేస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం రెండు సినిమాలను సెట్స్‌పై ఉంచింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఆకట్టుకోవాలనే పట్టుదతో ఈ అమ్మడు ఉంది. మెగా ఫ్యామిలీ పరువు తీయకుండా తాను సినిమాలు చేస్తాను అంటూ చెప్పుకొచ్చిన ఈ అమ్మడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఫ్యామిలీ కారణంగా తనను ఎవరు ప్రేమించడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ఒక మీడియా సంస్థకు నిహారిక ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా కాలేజ్‌ డేస్‌ నుండి కూడా చూస్తున్నాను, ఎవరైనా నాకు లవ్‌ లెటర్‌ ఇస్తారేమో, అది నా మొదటి లవ్‌ ప్రపోజల్‌గా దాచుకుందామని అనుకుంటున్నా. కాని ఇప్పటి వరకు నాకు ఏ ఒక్కరు కూడా లవ్‌ ప్రపోజల్‌ చేయలేదు. ప్రేమపై పెద్దగా ఆసక్తి లేకున్నా కూడా ఎవరైనా ప్రపోజ్‌ చేస్తే బాగుండు అని చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను అంటూ నిహారిక చెప్పుకొచ్చింది.

తన వెనుక ఉన్న ఫ్యామిలీ మెంబర్స్‌ వల్ల తనను లవ్‌ చేసేందుకు కుర్రాళ్లు బయపడుతున్నారు అంటూ నిహారిక చెప్పుకొచ్చింది. ఎవరు కూడా తనకు ప్రపోజ్‌ చేయక పోవడంతో అసలు తాను అందంగా ఉంటానా అనే అనుమానం నాకే కలుగుతుంది. మినిమం అందంగా కూడా తాను ఉండనా అంటూ నాపై నాకే అనుమానం వేస్తుందని ఈ సందర్బంగా నిహారిక చెప్పుకొచ్చింది. కమర్షియల్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాలనేది తన ఆశ అంటూ నిహారిక చెప్పుకొచ్చింది. రియల్‌ లైఫ్‌లో ఆమెకు ప్రేమను వ్యక్తం చేసేందుకు కుర్రాళ్లు భయపడ్డట్లుగానే సినిమాల్లో కూడా ఆమెకు అవకాశం ఇచ్చేందుకు కొందరు వెనుకంజ వేస్తున్నారు.