నిర్మాతలను హఢలెత్తిస్తున్న దర్శకుడు  

Star directors, who have craze to directors, have a budget of recovery. But some smaller directors are spending money on producers beyond their level. If so, the film will have success as well. Senior producers are advising the producers of this generation, saying that director and heroes should build films based on the level. Some people do not ignore the matter and get lost in construction and wear a shirt. We are planning to make a film that will have more than half of the film flops.

స్టార్‌ దర్శకులు, క్రేజ్‌ ఉన్న దర్శకులు ఎంత బడ్జెట్‌ పెట్టినా కూడా రికవరీ అయ్యే ఛాన్స్‌ ఉంటుంది. కాని కొందరు చిన్న దర్శకు కూడా తమ స్థాయిని మించి నిర్మాతలతో ఖర్చు చేయిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ సినిమా సక్సెస్‌ అయినా కూడా నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది...

నిర్మాతలను హఢలెత్తిస్తున్న దర్శకుడు-

అందుకే దర్శకుడు, హీరోల స్థాయిని బట్టి సినిమాలను నిర్మించాలి అంటూ సీనియర్‌ నిర్మాతలు ఈ తరం నిర్మాతలకు సలహాలు ఇస్తూ ఉంటారు. కొందరు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోకుండా నిర్మాణంలోకి దిగి నష్టపోయి నెత్తిన గుడ్డ వేసుకుంటారు. ఒక సినిమాను తీస్తున్నాం అంటే ఆ సినిమా ఫ్లాప్‌ అయినా కూడా సగం కంటే ఎక్కువ రికవరీ అయ్యేలా ప్లాన్‌ చేసుకోవాలి.

అలా జరగాలి అంటే కేవలం తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీసినప్పుడు మాత్రమే అలా జరుగుతుంది. తెలుగులో ఈమద్య కాలంలో సినిమాల నిర్మాణ వ్యయం చాలా పెరిగింది. రాజమౌళి ‘బాహుబలి’ చిత్రం తీసిన తర్వాత సినిమాలో కంటెంట్‌ ఉంటే ఎంత బడ్జెట్‌ అయినా రికవరీ అవుతుందనే నమ్మకంతో సినిమాలు తీసేస్తున్నారు. దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు తాజాగా రాజశేఖర్‌తో ‘గరుడవేగ’ చిత్రంను ఏకంగా 40 కోట్లు పెట్టి నిర్మించాడు. రాజశేఖర్‌కు, ప్రవీణ్‌ సత్తార్‌కు అంత బడ్జెట్‌ చాలా అంటే చాలా ఎక్కువ.

అయినా కూడా నిర్మాతలు ఆ మొత్తంను ఖర్చు పెట్టారు.
సినిమా సక్సెస్‌ అయ్యింది కనుక పర్వాలేదు. అదే సినిమా సక్సెస్‌ కాకుంటే నిర్మాతలకు ఏకంగా 30 కోట్ల మేరకు నష్టాలు వచ్చేవి అంటున్నారు. గరుడవేగ సూపర్‌ హిట్‌ అయినా కూడా నిర్మాతలకు పెద్దగా లాభాలు వచ్చింది లేదు..

ప్రవీణ్‌ సత్తారు గరుడవేగ చిత్రంకు అతిగా ఖర్చు చేశాడు అనే విమర్శ ఉన్నా కూడా ఆయ తర్వాత సినిమాకు కూడా అంతే స్థాయిలో ఖర్చు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. రామ్‌తో ఈయన తదుపరి చిత్రాన్ని అనుకున్నాడు. అయితే బడ్జెట్‌ విషయంలో భయపడి నిర్మాత స్రవంతి రవికిషోర్‌ తప్పుకున్నాడు.

రామ్‌ హీరోగా రాజశేఖర్‌ ముఖ్య పాత్రలో ప్రవీణ్‌ సత్తారు ఒక చిత్రాన్ని అనుకున్నాడు. ఆ చిత్రంను 40 కోట్లతో తీయాలని ప్లాన్‌ సిద్దం చేశాడు. దర్శకుడు చేస్తున్న ఏర్పాట్లు చూస్తుంటే 40 కోట్లను మించి మరీ బడ్జెట్‌ పెరిగే అవకాశం ఉందని నిర్మాత స్రవంతి రవికిషోర్‌ భావించాడు. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను వదిలేశాడు. ఈ ప్రాజెక్ట్‌ కోసం అప్పుడే దర్శకుడు రెండు కోట్లను ఖర్చు చేయించాడట.

రెండు కోట్లు పోతే పోనీకాని అంత ఖర్చు మాత్రం తన వల్ల కాదని వెనక్కు తగ్గాడు. ఇప్పుడు ఈయనతో సినిమాను నిర్మించేందుకు ఏ నిర్మాత కూడా ముందుకు రావడం లేదు. దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు ప్రస్తుతం నిర్మాత కోసం వెదుకుతున్నాడు.