నిద్ర త్వరగా పట్టాలంటే ఈ స్పెషల్ జ్యూస్ తాగండి

నిద్రపట్టడం అనేది ఎంత కష్టమైన విషయమో మీకు తెలుసు.ఈ స్మార్ట్ ఫోన్ జమానాలో అది ఇంకా కష్టమైన విషయం.

 This Is A Special Drink To Make You Sleep Early 1-TeluguStop.com

సరిగ్గా మనం పడుకునే సమయానికే వాట్సాప్ కి ఓ మెసేజ్ వస్తుంది.దానికి రెప్లై ఇవ్వడం, ఆ తరువాత వాళ్లతో కబుర్లు చెప్పి ఇక పడుకుందాం అని అనుకునేసరికి ఫేస్ బుక్ లో మనం పెట్టిన పోస్టుకి ఎన్ని లైక్స్ వచ్చాయో చూడానిపిస్తుంది.

అక్కడ కామెంట్స్ పడితే వాటికి రెప్లై ఇవ్వాలి.ఇక ట్విట్టర్ చూసి పడుకుందాం అనుకుంటే ట్విట్టర్ ఎదో ఒక ఆసక్తికరమైన లేదా వివాదాస్పద చర్చ జరుగుతుంది.

మరో అరగంట అక్కడ తినేస్తాం.ఇంతలో ఇంస్టాగ్రామ్ గుర్తొస్తే అదో కాసేపు.

ఇదంతా రోజు జరిగే తంతు.మన నిద్రని మనమే పాడుచేసుకుంటున్నాం.

చాలీచాలని నిద్ర వలన తెల్లారి లేవగానే కనులు ఎర్రబడతాయి, తల బరువుగా అనిపిస్తుంది.ఇక పని ఎలా చేయాలి అనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది.

అతికష్టం మీద పని మీద కూర్చున్నా, దాన్ని శ్రద్ధతో చేయడం కష్టమే.మరి నిద్ర త్వరగా ఎలా పట్టేది? స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టేస్తే పట్టేస్తుందా ? స్మార్ట్ ఫోన్ లేకపోతే ఏం ఏవేవో ఆలోచనలు ఉంటాయిగా.మరి ఎలా? ఇదిగోండి, నిద్ర త్వరగా పట్టేందుకు ఒక స్పెషల్ జ్యూస్.దానికి ఏం అవసరమో, ఎలా తయారుచేయాలో చూడండి.

కావాల్సినవి :


* పాలు
* గసగసాలు
* జాజికాయ

తయారుచేసే విధానం :


* మొదట గసగసాలను బ్రౌన్ రంగులోకి మారేదాకా వేయించండి.అయితే నూనె వాడకూడదు.

పెనం మీద ఊరికే కాల్చండి

* ఇప్పుడు ఆ గసగసాలను పౌడర్ అయ్యేలా గ్రైండ్ చేయండి

* ఇదే పద్ధతిలో జాజికాయని కూడా వేయించి, పౌడర్ తయారు చేసుకోండి

* గోరువెచ్చని పాలు ఒక గ్లాసు తీసుకోండి.చక్కర కలపవద్దు

* గసాగాసాల పౌడర్ మరియు జాజికాయ పౌడర్ వేసి బాగా కలపండి

* ఈ జ్యూస్ ని ప్రతిరోజూ పడుకోవడానికి కొన్ని నిమిషాల ముందు తాగండి.

గసగసాలు మరియు జాజికాయ ఒక మత్తు లాంటి ఫీల్ ని కలిగించి త్వరగా నిద్రపట్టేలా చేస్తాయి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు