నిత్యామీనన్‌ జీవితంలోనే పెద్ద తప్పు.. ఏడుస్తోంది!       2018-06-06   01:21:01  IST  Raghu V

సినిమా వారు వచ్చిన అవకాశం మిస్‌ అవ్వడం వల్ల దాని పరిణామాలు చాలా దూరం తీసుకు వెళ్తాయి. ఒక సినిమాను పొరపాటున చేస్తే ఆ సినిమా కెరీర్‌ను కూడా నాశనం చేసే అవకాశం ఉంటుంది. సినిమా వారి జీవితాలు చాలా సున్నితం అని ఇందుకే అంటూ ఉంటారు. సినిమాలో ఒకసారి గుర్తింపు వచ్చిన తర్వాత దాన్ని నిలుపుకోవాలి అంటే ఆచి తూచి అడుగులు వేయాలి. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలా అని ఏదైనా నిర్ణయాన్ని ఆలస్యం చేసినా కూడా దాని ప్రతిఫలం చేదుగా ఉంటుంది. నిర్ణయం ఆలస్యం చేయడం వల్ల ఏం జరుగుతుందో తాజాగా నిత్యామీనన్‌కు అర్థం అయ్యింది.

ప్రస్తుతం తెలుగులో ఉన్న హీరోయిన్స్‌లలో మంచి నటి అంటే నిత్యామీనన్‌ పేరు ముందు వరుసలో ఉంటుంది. అందుకే సావిత్రి జీవిత చరిత్రను తెరకెక్కించాలనుకున్నప్పుడు నిత్యామీనన్‌ను సంప్రదించారు. సావిత్రి జీవితంతో సినిమా అంటే ఎవరు చూస్తారు, ఆమె పాత్రను నేను చేసేది ఏముంటుందని నిత్యామీనన్‌ భావించింది. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ దాదాపు రెండు నెలల పాటు ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించాడు. కాని ఆమె మాత్రం అంతగా ఆసక్తి చూపించలేదు. సరే చూద్దాం అంటూ దర్శకుడు అశ్విన్‌ను తిప్పించుకుంది. చివరకు ఆమెపై ఆశ వదులుకున్న అశ్విన్‌ పలువురు హీరోయిన్‌లను పరిశీలించి చివరకు కీర్తి సురేష్‌ను ఎంపిక చేయడం జరిగింది.

సావిత్రిగా కీర్తి సురేష్‌ బాగా సూట్‌ అయ్యింది. అచ్చు సావిత్రిలాగే ఉందని అందరు అంటున్నారు. సావిత్రి కంటే కూడా బాగా నటించిందంటూ సినీ విమర్శకులు సైతం కీర్తి సురేష్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఒక అద్బుతమైన చిత్రంలో కీర్తి సురేష్‌ నటించిందంటూ అంతా కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో నిత్యామీనన్‌ జీవితంలో పెద్ద తప్పు చేశాను అంటూ తనలో తాను కుమిలి పోతున్నట్లుగా తెలుస్తోంది.

తాజాగా ఒక మీడియా సమావేశంలో మహానటి చిత్రంలో నటించక పోవడం వల్ల మీరు తప్పు చేశారా అని ప్రశ్నించిన సమయంలో ఆమె సమాధానంగా జరిగిపోయిన విషయం బాధ కల్గించడం ఖాయం. కాని బాధపడుతూ కూర్చుంటే ఫలితం ఉండదు అంటూ ఏదో సమాధానం చెప్పేసింది. నాగ్‌ అశ్విన్‌ అంతగా ఆమెను సంప్రదించిన సమయంలో ఓకే చెప్పి ఉంటే ప్రశంసలు, సన్మానాలు తనకే దక్కేవి కదా అంటూ నిత్యామీనన్‌ ప్రస్తుతం బాధపడుతున్నట్లుగా అనిపిస్తుంది.

గొప్ప అవకాశాలు సినిమా వారికి అయినా మరెవ్వరికి అయినా అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి. ఆ అవకాశాలను వినియోగించుకోలేక పోతే, ఇంతే జరుగుతుందని అంటున్నారు. నిత్యామీనన్‌కు జీవితంలో మళ్లీ ఇంత మంచి అవకాశం రాదు. ఇది అందరితో పాటు ఆమె కూడా అంటున్న మాట.