నా భర్తతో కంగనా డేటింగ్ చేసింది     2017-09-12   05:26:08  IST  Raghu V

-

-

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఈ మధ్య ఒక టీవీ షో లో చేసిన కామ్మేంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి.ఈ విషయం అందరికీ తెలిసిందే. సుమారు 15 ఏళ్ళ క్రితం కంగనా ఆదిత్య పంచోలి దగ్గర ఉన్నప్పుడు తనని తీవ్రంగా హింసించే వాడని. తన కూతురు వయసున్ననన్ను రక్తం వచ్చేలా కొట్టేవాడని ఆరోపించింది కంగనా. ఈ విషయాలు తన భార్య జరీనా కి చెప్పి సహాయం చేయమని అడిగినా తానూ కూడా పట్టించుకునేది కాదు అని అప్పటి విషయాలని వెల్లడించి సంచలనం సృష్టించింది..

జరీనా కంగనా అన్న మాటలకి చాలా ఘాటుగానే స్పందించింద కంగనా తన భర్తతో నాలుగున్నర ఏళ్ళు డేటింగ్ చేసింది. అలాంటప్పుడు తనని నేను ఒక కూతురు లా ఎలా చూస్తాం అని జరీనా ఎదురు ప్రశ్న వేసింది. ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా నాకు సాయం చేసే అలవాటు ఉంది అని. తన భర్త కంగనా ని ఇబ్బంది పెడుతున్నాడు అన్న విషయం ఆమె నాకు చెప్పలేదు అని స్పష్టం చేసింది జరీనా. కంగనా తన కొత్త సినిమా పుబ్లిసిటీ కోసం ఇలా ఆరోపణలు చేస్తోంది..నిజంగా జరిగిన విషయం అయితే ఇన్ని ఏళ్ల తరువాత ఇప్పుడు మాట్లాడవలసిన అవసరం ఏమిటి అని జరీనా ప్రశ్నించింది .

కంగనా సిస్టర్ జరీనా వ్యాఖ్యలకి అభ్యంతరం తెలిపింది. తన భర్తతో మైనర్(కంగన) డేటింగ్ చేస్తున్నట్లు తెలిసినపుడు. పెద్ద పెద్ద డైరెక్టర్లను కలవడానికి కంగనాకు బహుమతులు, ఎర వేయడం లాంటివి ఎందుకు చేశారని ప్రశ్నించారు. ఇది ఇలా ఉంటే ఆదిత్యా పంచోలి కంగనా వ్యాఖ్యలపై స్పందించారు..తన ప్రవర్తన మార్చుకోకపోతే లీగల్ గా చర్యలు తీసుకోడానికి కూడా వెనుకాడను అని చెప్పారు