నాగార్జున‌కు భార్య అయ్యే ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్‌     2017-09-11   22:19:46  IST  Raghu V

-

-

అక్కినేని నాగేశ్వరావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. నాగార్జున సినీ కెరియర్ దూసుకువెళ్తున్న సమయంలోనే నిర్మాత రామానాయుడు కూతురు లక్ష్మి ని పెళ్లి చేసుకున్నాడు. వారి ఇద్దరి సంతానమే నాగచైతన్య..తరువాత కొన్ని కారణాల వలన ఇద్దరూ విడిపోయారు.తరువాత కొంతకాలానికి నాగార్జున సినీ హీరోయిన్ అమల ని పెళ్లి చేసుకున్నాడు.వారి ఇద్దరి సంతానం అఖిల్. అందరికీ ఈ విషయాలు తెలిసినవే కానీ నాగార్జున పెళ్లి విషయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలని బయట పెట్టింది అలనాటి హీరోయిన్ సుమలత.

అక్కినేని నాగేశ్వరావు గారు నాగార్జున పెళ్లి విషయంలో చాలా ఆలోచించేవారట.ఒకరోజు నాగేశ్వరావు గారు షూటింగ్ లో ఉండగా ఒక అమ్మాయి ని చూసారట చూడగానే తన వద్దకి రమ్మని పిలిచారట. నీ పేరు ఏంటమ్మా ,చాలా లక్షణంగా ఉన్నావ్ నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా అని అడిగారట. ఈ విషయాన్ని స్వయంగా సుమలత ఒక టీవి ఇంటర్వూ లో చెప్పారట. అన్ని విషయాలు సక్రమంగా జరిగి ఉంటె ఈ పాటికి సుమలత నాగార్జున భార్యగా ఉండేదేమో. కానీ నాగార్జున అప్పటికే రామానాయుడి కూతురిని ప్రేమించాడు.ఈ విషయంలో ఏఎన్నార్ కూడా వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా చేయలేదట. తరువాత సుమలత కన్నడ నటుడు అంబరీష్ ని వివాహం చేసుకుకుని సెటిల్ అయ్యిందట.