నవరాత్రుల్లో ఈ పనులు చేస్తే కష్టాలను ఏరి కోరి తెచ్చుకున్నట్టే Devotional Bhakthi Songs Programs       2017-09-21   22:30:14  IST  Raghu V

దసరా నవరాత్రుల్లో కొన్ని పనులను చేయకూడదు. ఒకవేళ ఆ పనులను చేస్తే మనం ఏరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్టే. ఆ పనుల గురించి తెలుసుకుందాం. ఈ పనులను ఎట్టి పరిస్థిలోను దసరా నవరాత్రుల్లో చేయకూడదు.

ఇంటిలో దుర్గా దేవికి పూజ చేసే సమయంలో దేవికి ఎదురుగా కలశం ఉండాలి.

అంతేకాక అఖండ జ్యోతి తొమ్మిది రోజులు వెలిగేలా చూసుకోవాలి.

నవరాత్రుల తొమ్మిది రోజులు ఇంటిలో ఎవరో ఒకరు తప్పనిసరిగా ఉండాలి.

నవరాత్రులలో ఉపవాసం ఉండేవారు మధ్యాహ్న సమయంలో అసలు నిద్రపోకూడదు. ఆలా చేస్తే పూజ ఫలితం ఉండదు.

నవరాత్రుల్లో హెయిర్ కటింగ్ చేయించుకోకూడదు.

నవరాత్రి సమయంలో ఉపవాసం చేసినప్పుడు కొద్దీ మొత్తంలో మాత్రమే పండ్లను తీసుకోవాలి.

ఉపవాసం చేయని వారు పాల‌ను కూర‌గాయ‌ల‌తో క‌లిపి వండి తింటే మంచిది.

నవరాత్రి వంటకాలలో పంచదార వాడకూడదు. పంచదారకు బదులుగా బెల్లం లేదా తేనెను వాడవచ్చు.

నవరాత్రి తొమ్మిది రోజులు ఇంటిలో నిమ్మకాయను కోయరాదు.

ఉపవాసం చేసే సమయంలో బంగాళాదుంపను ఉడికించి మాత్రమే తీసుకోవాలి. కూరగా తినకూడదు. అలాగే ఇతర కూరగాయలను తినకూడదు.

,