నడిరోడ్డుపైనే సాఫ్ట్ వెర్ అమ్మాయి బట్టలు విప్పడానికి ట్రై చేసాడు.! చివరికి ఏమైందో తెలుసా?       2018-06-13   01:38:44  IST  Raghu V

స‌మాజంలో క్రూర మృగాలు పెరిగిపోయాయి. వాటికి అడ్డు, అదుపూ ఉండ‌డం లేదు. మ‌హిళ‌లు క‌న‌బ‌డితే చాలు రెచ్చిపోతున్నాయి. వారిపై అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతున్నాయి. వాటికి క‌న్నూ మిన్నూ క‌నిపించ‌దు. వావి, వ‌రుస, చిన్న‌, పెద్ద అనే తేడాలు ఉండ‌వు. పాశ‌వికంగా దాడి చేయ‌డ‌మే ప‌ని. ఓ మహిళ దుర్గాదేవి రూపం దాల్చితే ఎలా ఉంటుందో, బెంగుళూరులో జరిగిన ఈ సంఘటన చూస్తే మీకే అర్థం అవుతుంది.

బెంగుళూరు లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో పని చేస్తూ, కుందలహళ్లి అనే ప్రాంతంలో పిజి గా ఉంటోంది ఓ 25 ఏళ్ల మహిళ. బుధవారం రాత్రి ప్రతి రోజులాగే బయటకు మాములుగా నడవటానికి వెళ్లింది. అక్కడ నేవిజయ్ కుమార్ ఆమెతో సభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, నడి రోడ్డు మీద తన బట్టలు విప్పేయడానికి చేయడానికి ప్రయత్నించాడు.

-

కానీ ఆ మహిళ ధైర్యం గా ఎదురు తిరిగి తనను తాను కాపుడుకుంది. అతడు పారిపోడానికి ప్రయత్నించగా, తను అక్కడ చుట్టుపక్కల వారి సహాయంతో అతడిని వెంటాడి పట్టుకొని పోలీసులకు అప్పగించింది.

ఈ సంఘటన పైన మారతహళ్లి పోలీస్ స్టేషన్లో బుధవారం రోజున రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇంతా కష్టపడి ఆ మహిళా రిపోర్ట్ ఇస్తే, పోలీసులు ఆ వ్యక్తి మద్యం సేవించి ఉన్నందున, అతడి చర్యలు కేవలం మద్యం ప్రభావం వల్ల జరిగినవి కాని ఉద్దేశపూర్వకంగా చేయలేదు అని అరెస్ట్ చేయడానికి నిరాకరించారు.

నాకైతే అర్థంకావట్లేదు మద్యం సేవించి ఏం చేసినా మన ప్రభుత్వం ల చెల్లుతుందా..? కాని ఆ మహిళ వెనకడుగు వేయలేదు, ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే తనతో అలా ప్రవర్తించాడని పోలీసులకు వివరించింది. ఆ తరువాతనే, పోలీసులు అతడిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.