“ధనత్రయోదశి” రోజు ఈ వస్తువుల్లో ఏదో ఒకటి కొంటే మీకు అన్ని శుభాలే.  

దీపావళి పండుగ అంటే చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ సంబరపడతారు.ఆ రోజు లక్ష్మి పూజ చేసుకొని స్వీట్ తిని టపాసులు కాల్చుతారు.

నరకాసురుని చంపిన రోజును ఆనందంగా మనం దీపావళి పండుగను చేసుకుంటున్నాం.దీపావ‌ళికి ముందు రోజున ధనత్రయోదశి వస్తుంది.ఆ రోజు అందరూ లక్ష్మి పూజ చేస్తారు.ఈ నెల 15 వ తేదీన ధనత్రయోదశి వస్తుంది.ఆ రోజు లక్ష్మి దేవి పూజతో పాటు కొన్ని వస్తువులను కొంటే శుభాలు జరుగుతాయి.ఆ రోజు ఏ వస్తువులు కొనాలో తెలుసుకుందాం.

“ధనత్రయోదశి” రోజు ఈ వస్తువుల్లో ఏదో ఒకటి కొంటే మీకు అన్ని శుభాలే. Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి )--

ధనత్రయోదశి రోజున బంగారం కొంటే మంచిది.ఆ రోజు ఉద‌యం 6.34 నిమిషాలకు, సాయంత్రం 6.20 నిమిషాలకు బంగారాన్ని కొంటే మంచిదట.ఆ సమయంలో కొనటం కుదరని వారు రోజులో ఏ సమయంలోనైనా కొనవచ్చు.

ల‌క్ష్మీదేవి, వినాయ‌కుడు కలిసి ఉన్న ఫోటో లేదా గోల్డ్ కోయిన్ ఇంటికి తెచ్చి పూజ చేస్తే ఇంటిలో అంతా మంచి జరగటమే కాకుండా సంపద వృద్ధి కూడా జరుగుతుంది.

స్వ‌స్తిక్ చిహ్నంను ఇంటి ప్ర‌ధాన ద్వార గుమ్మానికి వ్రేలాడదీస్తే ఇంటిలోని వారికీ అదృష్టం కలిసి వస్తుంది.

గోమ‌తి చ‌క్ర అనే పేరున్న 11 గ‌వ్వ‌ల‌ను కొనుగోలు చేసి పసుపు వస్త్రంలో చుట్టి లాకర్ లో పెడితే సంపద పెరుగుతుంది.

చేసే వృత్తికి సంబందించిన వస్తువులను ఆ రోజు కొనుగోలు చేసి పూజ చేస్తే ఆ రంగంలో విజయం సాధిస్తారు.

ఇత్త‌డితో త‌యారు చేసిన వంట పాత్ర‌ల‌ను ధనత్రయోదశి రోజున కొనుగోలు చేసి ఇంటిలో తూర్పు వైపున పెడితే అదృష్టం కలిసి వస్తుంది.

వ్యాపారం చేసే వారు అకౌంట్స్ పుస్త‌కాన్ని కొనుగోలు చేసి షాప్ లో పడమర వైపు పెడితే వ్యాపార వృద్ధి జరుగుతుంది.

మొబైల్ ఫోన్‌, టీవీ,ఫ్రిజ్‌ వంటి ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులను ధనత్రయోదశి రోజున కొనుగోలు చేసి ఇంట్లో వాయువ్య దిశ‌గా పెడితే అనుకున్న పనులు త్వరగా జరుగుతాయి.

ధనత్రయోదశి రోజున చీపురు కొంటే ఇంటికి పట్టిన ద‌రిద్రం పోతుంది.

DEVOTIONAL