దేవుడా.. చివరకు లాక్ డౌన్ పై కూడా బెట్టింగ్సా..?!

దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండడంతో దేశంలో లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగుతున్నది.ఇదే అదనుగా తీసుకొని కొంతమంది దీనిని సాకుగా చూపించి దేశంలో లాక్ డౌన్ విధిస్తారు అంటూ భారీగా బెట్టింగులు జరుపుతుండడం నిజంగా బాధాకరమైన విషయం.

 At Last People Are Also Betting On Corona Lock Down-TeluguStop.com

యువత దీనిని అదనుగా మలచుకుని లాక్ డౌన్ పై కూడా బెట్టింగులు కాస్తున్నారు.

మే 2 నుంచి లాక్ డౌన్ ఉంటుందంటూ కొందరు బెట్టింగులు కాస్తున్నారు.

 At Last People Are Also Betting On Corona Lock Down-దేవుడా.. చివరకు లాక్ డౌన్ పై కూడా బెట్టింగ్సా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నెల రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.జనాల వీక్ నెస్ కూడా బెట్టింగ్ రాయుళ్ళు తమకు అనుకూలంగా మలుచు కుంటున్నారు.

దీంతో కొందరు తమ జేబులలో డబ్బులు నింపుకుంటున్నారు.ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో యువత పై నిఘా పెట్టారు.

గత ఏడాది కూడా తొలి దశ లాక్ డౌన్ విధించినప్పుడు ఎప్పుడు ఆంక్షలు సడలిస్తారనే విషయం పై జోరుగా బెట్టింగులకు యువత పాల్ప డుతున్నరు.ఒకవైపు రోజురోజుకు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నది.

అందువల్ల పాజిటివ్ కేసులు చాలా ఎక్కువగా నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు.

Telugu Bettings, Carona, Carona Virus, Corona, Corona Betting, Corona Second Wave, Corona Virus, Covid Vaccine, Covid-19, Covid-19 Vaccine, Delhi, Lock Down-Latest News - Telugu

ఇదే సమయంలో పలు రాష్ట్రాలు కూడా రాత్రి కర్ఫ్యూలు, వీకెండ్ లో కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి.మరోవైపు ఒడిస్సా, హర్యానా, పంజాబ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు అనేక పరీక్షలను ఇప్పటికే రద్దు చేశాయి.ఈ లాక్ డౌన్ ను సాకుగా చూపి యువత బెట్టింగులు కాయడం చాలా విచిత్రంగా కొనసాగుతుంది.

క్రికెట్ మీద, ఎన్నికల ఫలితాల మీద, కోడి పందేల మీద బెట్టింగులు కట్టడము మనకందరికీ తెలుసు.ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే విషయం మీద కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉండడం మనము గమనించాము.

కానీ ఇప్పుడు కరోనా పేరుతో బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు.వివిధ నగరాల్లో కొవిడ్ కేసులు మరణాలపై రోజువారి బెట్టింగులు కూడా జరిగినట్టు ఢిల్లీకి చెందిన ఓ బుకీ వెల్లడించారు.

కొత్త రకం వైరస్ రావడంతో దీనిపై జోరుగానే బెట్టింగులు నిర్వహించామని తెలిపాడు.ఏమైనప్పటికీ జనాలు కరోనా వైరస్ తో బాధపడుతూ ఉంటే కొందరు దీనిని తమ అదునుగా మలచుకుని డబ్బులు సంపాదించడం గమనార్హం.

#Lock Down #COVID-19 #Bettings #Carona Virus #Corona

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు