దూసుకుపోతున్న జగన్ .. దాటుకుపోతున్న పవన్       2018-06-11   01:32:01  IST  Bhanu C

రోజుకో సర్వే బయటకి వస్తోంది .. రాజకీయ పార్టీలకు దడ పుట్టిస్తోంది ! అంతర్గతంగా ఆయా పార్టీల సర్వేలు చేయించుకోవడం .. ఆ సర్వేల్లో ఏమి తేలినా … బయటకి మాత్రం అదిగో సర్వే… మా పార్టీకి ప్రజల్లో విశ్వాసం సంపాదించింది. గెలవబోయేది మేమే అంటూ సొంత డబ్బాలు కొట్టుకోవడం మాములే. అయితే వాటి సంగతి పక్కనపెడితే కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు బయాపెడుతున్న సర్వే రిపోర్టులు మాత్రం పార్టీలను కంగారు పెట్టేస్తున్నాయి.

ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రిక చంద్రబాబునాయుడు నాలుగేళ్ళ పాలన పై సర్వే జరిపిందట. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం చంద్రబాబుకు పెద్ద షాకే తగిలింది. దినపత్రికి వివిధ అంశాలపై రాష్ట్రంలో సర్వే నిర్వహించిందట. వచ్చే ఎన్నికల్లో ఓటు ఎవరికి వేస్తారని అడిగిన ప్రశ్నకు 42 శాతం మంది జగన్‌కే ఓటేస్తామన్నారట. తమ ఓటు చంద్రబాబుకే అన్నవాళ్ళు 30 శాతమేనట. పవన్ కల్యాణ్ కు 19 శాతం మంది మద్దతు ఇచ్చారని వరుసగా కధనాలు వస్తున్నాయి.

చంద్రబాబు పాలన ఎలా ఉంది అంటూ … జనాల అభిప్రాయం కోరగా ఏమీ బాగోలేదని 42 శాతం మంది అభిప్రాయపడ్డారట. చంద్రబాబు పాలన బాగుందని 36 శాతం మంది తేల్చేశారట. మిగిలిన వారు పెద్దగా సంతృప్తిగా లేదనే చెప్పారట. పనిలో పనిగా చంద్రబాబు అనుభవం రాష్ట్రాభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడలేదని 58 శాతం అభిప్రాయ పడ్డారట. అంటే దేశంలో తానే అందరికన్నా సీనియర్‌ను తానే అని చెప్పుకుంటున్న చంద్రబాబుది కేవలం సొంతడబ్బా కోరుకుంటున్నారు అనేది ఈ సర్వేతో తేలిపోయింది అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఏపీకి అతి ముఖ్యమైన ప్రత్యేక హోదా విషయంలో బాబు తన అసమర్ధత బయటపెట్టుకున్నారని… ఈ విషయంలో ఆయన ఫెయిలయ్యారని 56 శాతం మంది అనుకుంటున్నారట. నాలుగేళ్ళలో అవినీతి విపరీతంగా పెరిగిందని అనుకుంటున్న వారు 46 శాతం మంది ఉన్నారట. ఇలా చంద్రబాబు పాలనకు సంబంధించిన ప్రతీ అంశంలోనూ జనాల్లో తీవ్ర అసంతృప్తి ఉన్న విషయం స్పష్టంగా బయటపడింది. అయితే ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం బాబు గ్రాఫ్ తగ్గుతుండగా .. జగన్ పవన్ స్పీడ్ పెంచినట్టు అర్ధం అవుతోంది.