దిల్‌రాజు తెలివి తక్కువ నిర్ణయాలు!!!       2018-05-19   02:28:15  IST  Raghu V

డిస్ట్రిబ్యూటర్‌గా సినిమా పరిశ్రమలోకి ఎంటర్‌ అయిన దిల్‌రాజు నిర్మాతగా టాలీవుడ్‌లో టాప్‌ పొజీషన్‌ను దక్కించుకున్నాడు. ఈయన పంపిణీ చేసే సినిమాల్లో, నిర్మించే సినిమాల్లో మ్యాటర్‌ ఉంటుందనే అభిప్రాయం అందరిలో ఉంటుంది. అందుకే ఈయన సినిమాలను ప్రేక్షకులు ఆధరించారు. కాని ప్రస్తుతం ఈయన తన మార్క్‌ను పోగొట్టుకుంటున్నాడు. గతంలో మాదిరిగా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈయన సినిమాల పంపిణీ జరగడం లేదు. సినిమా నిర్మాణం విషయం పక్కకు పెడితే ఈయన డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్న సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేక పోతున్నాయి. ఇటీవలే ఈయన ‘మెహబూబా’ చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది.

పూరిపై నమ్మకంతో, విభిన్నమైన కథ అంటూ దిల్‌రాజు ‘మెహబూబా’ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయడం జరిగింది. కాని ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. ఏమాత్రం మెప్పించని కథ, కథనాతో ఆ సినిమా ఉంది. ఆ సినిమా వల్ల దిల్‌రాజుకు భారీ నష్టం ఏర్పడటం జరిగింది. అయినా కూడా దిల్‌రాజు జాగ్రత్త పడటం లేదు. తాజాగా ఈయన బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా తెరక్కుతున్న ‘సాక్ష్యం’ సినిమాను పంపిణీ చేసేందుకు సిద్దం అయ్యాడు. నైజాం రైట్స్‌ను భారీ రేటుకు కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతుంది.

సినిమా పరిశ్రమలో దిల్‌రాజుకు మంచి పేరు ఉంది. ఒక సినిమాను దిల్‌రాజు నైజాం ఏరియా పంపిణీ హక్కులు తీసుకుంటే ఇతర ఏరియాల్లో మంచి బిజినెస్‌ జరుగుతుంది. అందుకే సాక్ష్యం నిర్మాతలు పట్టుబట్టి మరీ దిల్‌రాజుతో ఈ సినిమాను కొనుగోలు చేయించినట్లుగా సమాచారం అందుతుంది. దిల్‌రాజు ఈ చిత్రంపై మక్కువతో కంటే, నిర్మాతలతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతుంది. సాక్ష్యం చిత్రంపై పెద్దగా అంచనాలు లేవు. ఆ చిత్ర దర్శకుడు శ్రీవాస్‌కు సక్సెస్‌ ట్రాక్‌ లేదు, దాంతో పాటు బెల్లంకొండ హీరో ఇప్పటి వరకు మంచి కమర్షియల్‌ హీరోగా గుర్తింపు దక్కించుకోలేక పోయాడు.
ఇలాంటి సినిమాను డిస్ట్రిబ్యూట్‌ చే
కు ముందుకు రావడం అనేది సాహస నిర్ణయమే అని చెప్పుకోవచ్చు. గతంలో తెలివితో సినిమాల జయాపజయాలను అంచనా వేసి కొనుగోలు చేసిన దిల్‌రాజు ప్రస్తుతం అలా ఆలోచించలేక పోతున్నాడు. సినిమాలో మ్యాటర్‌ ఉందా లేదా అనే విషయాన్ని బేరీజు వేయకుండానే దిల్‌రాజు వరుసగా సినిమాలను కొనుగోలు చేస్తున్నాడు. దాంతో దిల్‌రాజుకు వరుసగా పంపిణీ చేసిన సినిమాలు నష్టాలను మిగుల్చుతున్నాయి. మరి సాక్ష్యం చిత్రం దిల్‌రాజును ఎంత మేరకు ముంచేనో చూడాలి.