దారుణం..బాలికపై ఐదుగురు “మైనర్ల అత్యాచారం”       2018-05-24   02:09:09  IST  Raghu V

బడికి వెళ్లి బుద్దిగా చందువుకోవాల్సిన వాళ్ళు పిల్లల జీవితాలు గతి తప్పుతున్నాయి..చిన్న చిన్న వయసు పిల్లలు సెక్సువల్ విషయాలపై ఆలోచనలు చేస్తున్నారు..తల్లితండ్రుల పర్యవేక్షణ లోపం.. ఇబ్బడిముబ్బడిగా పెరుగిపోతున నెట్ సౌకర్యం..చేతిలో పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వడం..ఆ మోజులో చిన్న వయసులోనే చూడకూడని చేయకూడని పనులకి ఆకర్షితులు కావడం ఇవన్నీబాల్యాన్ని చిన్నతనంలోనే చిదిమేస్తున్నాయి..వారి పసి పనసుల్లో విషబీజాలు నాటుతున్నాయి.


తల్లి తండ్రులు కనుకా మేల్కొనక పొతే తీవ్రమైన ఘోరాలు జరిగే పమాడం ఉందని నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు..అయితే తాజగా జరిగిన సంఘటన ఇప్పుడు అందరిని దిగ్బ్రాంతికి గురి చేస్తోంది…చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో దారుణం చోటుచేసుకుంది. 11 సంవత్సరాల బాలికపై ఐదుగురు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు..ఈ సంఘటన ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది..

వివరాలలోకి వెళ్తే..పుంగనూరు భగత్‌సింగ్ కాలనీకి చెందిన 11ఏళ్ళ పసి బాలికపై అదే కాలనీకి చెందిన ఐదుగురు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు…అయితే ఈ విషయం బాలిక స్థానిక వ్యక్తులకి చెప్పడంతో…వారు నలుగురు మైనర్లని పట్టుకుని చితకబాదారు..వారికి తీవ్ర గాయాలు అయ్యిన తరువాత పోలీసులకి అప్పగించారు..అయితే మరొక మైనర్ బాలుడు పరారీలో ఉన్నాడు..చిన్న వయసులో ఇటువంటి ప్రభావం పిల్లల మీద పడటం పూర్తిగా అందుబాటులో ఉంటున్న సాంకేతిక పరిజ్ఞానమేనని.. తల్లి తండ్రులు పిల్లలై పట్టించుకోక పోవడం ఇన్ని అనర్దాలకి కారణం అవుతోందని మానసిక నిపులును హెచ్చరిస్తున్నారు.