దారుణం..ప్రియుడి తల్లిపై లైంఘిక దాడి.       2018-05-29   02:34:22  IST  Raghu V

ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు..ప్రేమించి పెళ్లి చేసుకున్నారు..అయితే వీరి పెళ్ళికి అమ్మాయి తరుపు వారు ఒప్పుకోలేదు దాంతో ఆడపిల్ల తరువు వారు పాల్పడిన దారుణానికి సభ్యసమాజం సిగ్గుతో తల దించు కోవలసిన పరిస్థితి ఏర్పడింది…చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది..వివరాలలోకి వెళ్తే..

చిత్తూరు జిల్లా రేణిగుంట సమీప ప్రాంతానికి చెందిన యువకుడు (27), తమిళనాడులోని తిరుత్తణికి చెందిన దూరపు బంధువైన అమ్మాయి(16) ప్రేమించుకున్నారు. అది తెలిసిన కుటుంబీకులు మరో యువకుడితో ఆ యువతికి నిశ్చితార్థం చేయబోయారు. ఈ విషయం అమ్మాయి ఫోన్‌ ద్వారా ప్రియుడికి చెప్పడంతో అతడు వెళ్లి ప్రియురాలిని ప్రకాశం జిల్లా ఒంగోలుకు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు.అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రేమికురాలి తరుపు వారు దారుణానికి ఒడిగట్టారు..

ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన ఆమె కుటుంబీకులు రేణిగుంట సమీపంలోని యువకుడి ఇంటిపై దాడి చేశారు…ప్రేమికుడి తల్లిని భందించి వాహనంలో తీసుకుని వెళ్లి మూడు రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడ్డారు..అత్యంత నీచమైన ఈ ఘటన తో చుట్టుపక్కల వారు ఉలిక్కి పడ్డారు..అంతేకాదు తమ కూతురిని వదలకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రేమికుడిని ఫోన్‌లో బెదిరించారు.

దీనిపై గాజులమండ్యం పోలీసులకు భాదితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో సోమవారం బాధితురాలు తిరుపతి అర్బన్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు..దాంతో స్పందించిన ఎస్పీ భాదితుల కి ధైర్యం చెప్పారు తప్పకుండా వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు..