దానిమ్మ తొక్కలో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే...తొక్క అసలు పాడేయరు

మనకు అన్ని కాలాలలోనూ రెగ్యులర్ గా దానిమ్మ పండు దొరుకుతుంది.దానిమ్మ పండు అంటే చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరు ఇష్టపడతారు.

 Health Benefits Of Pomegranate Peel-TeluguStop.com

మంచి రుచితో ఉండే దానిమ్మలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.మనకు దానిమ్మ గింజలలో ఉండే పోషకాల గురించి మరియు మన ఆరోగ్యానికి చాలా మంచిదని మాత్రమే తెలుసు.

మనం తొక్కే కదా అని తీసి పాడేసే దానిమ్మ తొక్కలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఈ ప్రయోజనాల గురించి తెలుసుకుంటే దానిమ్మ గింజలతో పాటు తొక్కను కూడా ఉపయోగిస్తారు.

దానిమ్మ తొక్క వగరుగా ఉండుట వలన చాలా మంది ఇష్టపడరు.దానిమ్మ తొక్కను బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సలాడ్స్ లో కలుపుకొని తింటే ఆ వగరు తెలియదు.

దానిమ్మ తొక్క తినటం వలన శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి.అలాగే రోగనిరోధక శక్తి పెరిగి గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

దానిమ్మ తొక్కలను ఎండపెట్టి పొడి చేయాలి.ఈ పొడిలో నీరు కలిపి పేస్ట్ గా చేసి దంతాలను శుభ్రం చేసుకుంటే దంతాలు తెల్లగా మారటమే కాకుండా దృడంగా ఉంటాయి.

దానిమ్మ గింజల పొడిని నీటిలో వేసి బాగా కలిపి నోటిలో పోసుకొని పుక్కిలిస్తే గొంతులో గరగర తగ్గిపోతుంది.

దానిమ్మ తొక్కలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి త్రాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

వయస్సు రీత్యా వచ్చే ముడతలు కూడా తగ్గిపోతాయి.అంతేకాక శరీరంలో విష పదార్ధాలను బయటకు పంపటంలో కూడా సహాయపడుతుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు