దానయ్య.. నువ్వు గ్రేట్‌ అయ్యా!     2018-05-07   00:16:58  IST  Raghu V

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక్క స్టార్‌ హీరోతో సినిమా నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. ఎంతగానో ప్రయత్నాలు చేస్తే ఒక స్టార్‌ హీరో డేట్స్‌ కుదరడం కష్టం. అలాంటిది నిర్మాత దానయ్య వరుసగా మహేష్‌బాబు, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లతో సినిమాలు చేస్తూ ఈమద్య కాలంలో టాప్‌ నిర్మాతగా దూసుకు పోతున్నాడు. దానయ్య ఈ మద్య నిర్మిస్తున్న ప్రతి సినిమా కూడా రికార్డులు బ్రేక్‌ చేస్తున్నాయి. ఈయన నిర్మించిన ‘భరత్‌ అనే నేను’ చిత్రం టాలీవుడ్‌ టాప్‌ 3 చిత్రంగా నిలిచిన విషయం తెల్సిందే. రెండు వారాల్లో రెండు వందల కోట్ల కలెక్షన్స్‌ సాధించి దానయ్యకు దాదాపు 100 కోట్ల లాభాలను తెచ్చి పెట్టిందనే టాక్‌ వినిపిస్తుంది.

భరత్‌ అనే నేను చిత్రం విడుదల అయ్యిందో లేదో అప్పుడే మరో స్టార్‌తో సినిమాను మొదలు పెట్టాడు. రామ్‌ చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌కు దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. నిర్మాత దానయ్య ఈ చిత్రాన్ని దాదాపు 65 కోట్లతో తెరకెక్కిస్తున్నాడు. అయితే రామ్‌ చరణ్‌కు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో, బోయపాటిపై ఉన్న నమ్మకంతో అన్ని ఏరియాల్లో ఈ చిత్రం ఖచ్చితంగా 150 కోట్ల బిజినెస్‌ను చేయడం ఖాయం అంటున్నారు. అంటే ఈ చిత్రంతో కూడా దానయ్యకు భారీగా లాభాలు దక్కడం ఖాయం అంటూ ఇప్పటికే నిర్థారణ అయ్యింది.