సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి మండల కేంద్రంలోని స్థానిక సెంటర్ నందు దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు దళిత సంఘాల నేతలు మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం సూర్యాపేట నివాసి,అధికార పార్టీ ప్రజా ప్రతినిధి వట్టె జానయ్య కుమారులు వారితో పాటు 20 మంది దుండగులు వెలుగుపల్లి గ్రామంలో దళిత కుటుంబంపై పడి వృద్ధులైన భార్యాభర్తలను,వారి కుమారుడైన రామును మారణాయుధాలతో రైఫిల్ తో బెదిరించి,కొట్టి విచక్షణారహితంగా గాయపరచడం జరిగిందని అన్నారు.
ప్రస్తుతం హైదరాబాదులో ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారని తెలిపారు.ఈ దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, వారిని వెంటనే అరెస్టు చేయాలని వివిధ దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.