తెరుచుకున్న చర్మ రంధ్రాలను నివారించే బెస్ట్ హోమ్ రెమెడీస్ ఇవే!

Home Remedies To Get Rid Of Skin Pores

చర్మం పై రంధ్రాలు(స్కిన్ పోర్స్‌ స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది కామ‌న్‌గా ఎదుర్కొనే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.గ‌డ్డం, నుదురు, ముక్కు వంటి ప్రాంతాల్లో రంధ్రాలు ఎక్కువ‌గా ఏర్ప‌డుతుంటాయి.

 Home Remedies To Get Rid Of Skin Pores-TeluguStop.com

దాంతో ముఖ కాంతి తీవ్రంగా దెబ్బ తింటుంది.దుమ్ము, ధూళి, పోష‌కాల లోపం, చ‌ర్మంపై అధిక జిడ్డు ఉత్ప‌త్తి అవ్వ‌డం, ఆహార‌పు అల‌వాట్లు, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే మేక‌ప్ ప్రోడెక్ట్స్ వాడ‌టం, స‌రైన స్కిన్ కేర్ లేక‌పోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

అయితే తెరుచుకున్న చర్మ రంధ్రాలను నివారించడంలో కొన్ని కొన్ని హోమ్ రెమెడీస్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.మ‌రి ఆ రెమెడీస్ ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

 Home Remedies To Get Rid Of Skin Pores-తెరుచుకున్న చర్మ రంధ్రాలను నివారించే బెస్ట్ హోమ్ రెమెడీస్ ఇవే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బ్రేకింగ్ సోడాతో చ‌ర్మ రంధ్రాలకు చెక్ పెట్ట‌వ‌చ్చు.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ బేకింగ్ సోడా మ‌రియు గోరు వెచ్చ‌ని నీరు పోసి క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖంపై అప్లై చేసి.వేళ్ల‌తో స‌ర్కిల‌ర్ మోష‌న్‌లో మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు రుద్దుకోవాలి.

ఆ త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.రెండు రోజుల‌కు ఒక సారి ఇలా చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ ముల్తానీ మ‌ట్టి, పెరుగు మ‌రియు కొద్దిగా రోజ్ వాట‌ర్ వేసుకుని బాగా క‌లిపి ముఖానికి ప‌ట్టించాలి.పావు గంట పాటు డ్రై అవ్వ‌నిచ్చి అనంత‌రం త‌డి చేతుల‌తో స్క్ర‌బ్ చేసుకుంటూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా చేసిన తెరుచుకున్న రంధ్రాలు మూసుకుపోతాయి.

ఇక ఒక బౌల్ తీసుకున అందులో ఓట్స్ పొడి, పాల పొడి మ‌రియు తేనె వేసుకుని క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ఫేస్‌కు అప్లై చేసి.బాగా ఆరిన త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.

ఇలా డే బై డే చేసినా కూడా ఓపెన్ పోర్స్ త‌గ్గి.చ‌ర్మం బిగుతుగా మారుతుంది.

#Tips #Face #Care Tips #Skin Care

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube