ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.41
సూర్యాస్తమయం: సాయంత్రం.5.39
రాహుకాలం: మ.1.30 ల3.00
అమృత ఘడియలు: ఉ.7.30 ల9.30 మ3.30 సా4.30
దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3.21 సా 4.12
మేషం:
ఈరోజు మీకు ఆర్థికపరంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన విషయాలపై ఆసక్తి చూపుతారు.మీ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.మీ పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తారు.వ్యాపార రంగంలో పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.
వృషభం:
ఈరోజు మీరు ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.దూరపు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.బంధువులతో వాదనలకు దిగా అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మిథునం:
ఈరోజు మీరు కొన్ని దూరం ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.మీరు చేసే పనిలో బలహీనతతో సతమతమవుతారు.తరచూ మారే మీ నిర్ణయాన్ని వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ మనసులో ఉన్న మాట ఇతరులతో పంచుకోండి.
కర్కాటకం:
ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఈరోజుతో మీ కోర్టు సమస్యలన్నీ తీరిపోతాయి.కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలకు వెళ్తారు.ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
సింహం:
ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.ఏదైనా పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.మీ జీవిత భాగస్వామితో కలసి సంతోషంగా ఉంటారు.
కన్య:
ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అనవసరంగా ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
తుల:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.
ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
వృశ్చికం:
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
ధనుస్సు:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు మీ సొమ్ము అప్పుగా ఇవ్వకూడదు.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.చాలా సంతోషంగా ఉంటారు.
మకరం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.అంతే కాకుండా అవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.
కుంభం:
ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
కొన్ని పరిచయాలు పెరగడం వల్ల మంచి అనుభూతి కలుగుతుంది.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
మీనం:
ఈరోజు మీరు తీరిక లేని సమయంలో గడుపుతారు.దీనివల్ల పనులన్నీ ఆలస్యంగా జరుగుతాయి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు పొందే అవకాశం ఉంది.
LATEST NEWS - TELUGU