తల్లి బయటకి వెళ్ళగానే...టీవీ సీరియల్ చూస్తూ ఆ చిన్నారి ఏం చేసిందో తెలుస్తే షాక్.!       2018-06-11   00:53:54  IST  Raghu V

నారదుడు తన బ్రాంచిలను భూమ్మీద సీక్రెట్ గా మెయింటెయిన్ చేస్తున్నాడు..టీవి సీరియళ్ల రూపంలో అని..ఇటీవల ఒక పోస్టు చదివా ఎఫ్బీలో…నిజమే కదా అనిపించింది..ఎప్పుడు చూసినా అందులో అత్తకోడల్ల గొడవలు,భార్య భర్తల తగాదాలు తప్ప ఏం ఉండవ్..వాటిని చూస్తూ జనం కూడా అలాగే తయారవుతున్నారు.తాజాగా టీవి సీరియల్ ఒక చిన్నారి ప్రాణం బలితీసుకుంది…

ఆ చిన్నారి రోజు సీరియల్స్‌లో వచ్చే సీన్స్‌ను అనుకరించేదని… వాటిని చూసి తామంతా మురిసిపోయేవాళ్లమని, కానీ ఇంతటీ ఘోరం జరుగుతుందని ఊహించలేదంటూ ఆ బాలిక బంధువులు కన్నీటీ పర్యంతమయ్యారు. అసలేమైంది అంటే.?

టీవీ సీరియల్‌లో వచ్చిన ఆత్మహత్య సీన్‌ను అనుకరించిన ఓ ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన కోల్‌కతా ఇచ్చాపుర్‌ పట్టణంలో జరిగింది. ఈ ఘటన చోటుచేసుకున్న సమయంలో ఆ చిన్నారి రెండు నెలల తమ్ముడు మినహా ఇంట్లో ఎవరూ లేరు. బ్యాంక్‌లో డబ్బు డిపాజిట్‌ చేయడానికి ఆ చిన్నారి తల్లి బయటకు వెళ్లగా… తండ్రి రోజువారి పని మీద వెళ్లాడు.

-

2 నెలల బాబు మాత్రమే ఉన్నాడు. అయితే ఆ తల్లి తన పిల్లలను ఓ కంట కనిపెట్టమని, పక్కింటి వారికి కూడా చెప్పింది. కానీ ఆమె తిరొగొచ్చేసరికి స్కార్ఫ్‌తో ఉరేసుకున్న తన బిడ్డ కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు.