తండ్రి టీ అమ్మితే ఆ కష్టానికి తన ప్రతిభ తో కోట్లు సంపాదించిన కూతురు       2018-06-20   02:29:55  IST  Bhanu C

ఆమె భారత్ లో పేద కుటుంభానికి చెందిన విద్యార్ధిని ఆమె తండ్రి చాయ్ అమ్ముకుంటూ కుటుంబాన్ని నడుపుతున్నాడు..అయితే అతడి కూతురుకి అమెరికాలోని మస్సాచుసెట్స్‌లోని బాబ్సన్ కళాశాలలో స్కాలర్‌షిప్ వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3.8 కోట్ల స్కాలర్‌షిప్ అందించడమే కాకుండా ప్రతిష్టాత్మక బాబ్సన్ కాలేజీలో చదివే అవకాశం అందించింది..వివరాలలోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని బులందషహర్‌కు చెందిన “సుదీక్ష భాటి” పన్నెండో తరగతిలో 98 శాతం మార్కులు తెచ్చుకొని జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది…ఆమెది పేద కుటుంభం తండ్రి టీ అమ్మిన సొమ్ముతోనే కుటుంభాన్ని పోషిస్తున్నాడు ఫీజు కట్టక పోవడం వలన ఓ స్కూల్ యాజమాన్యం ఇంటికి పంపేసింది..దాంతో ఆమెని ఊళ్లోని ప్రాథమిక పాఠశాలలో చేర్పించాడు. డబ్బు కట్టలేక ఆ పాఠశాలకు వెళ్తున్న ఆమెను కొందరు హేళన చేసేవారు.

ఎన్నో అవమానాలు భరించి కష్టపడి చదివిన ఆమె అచివారికి మంచి మార్కులతో అయిదో తరగతి పాసైంది. ఆ సమయంలోనే శివనాడార్‌ ఫౌండేషన్‌ సుదీక్షకు చేయూతనందించింది. ఈ సంస్థ గ్రామీణ భారతంలో ఆర్థికంగా వెనుకబడి చదువుకోలేని తెలివైన విద్యార్థులకు సాయం చేస్తుంటుంది. అలా ఆ సంస్థ సాయంతో విద్యాజ్ఞాన్‌ పాఠశాలలో చదివింది.

ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు సమ్మర్‌లో నిర్వహించే డ్యూక్‌ టిప్‌ (ఇండియా), పెన్సిల్వేనియా స్కూల్‌ ఫర్‌ గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ లలో పాల్గొన్నది. పాఠశాలలో చదువుతున్నప్పుడే అమ్మాయిలను స్కూల్‌కి పంపించమని వాయిస్‌ ఆఫ్‌ విమెన్‌ పేరిట ఒక అవగాహనా కార్యక్రమాన్నీ నిర్వహించింది.అ.చివరికి ఎంతో ప్రతిష్టాత్మక అమెరికా స్కాలర్షిప్ అందుకుని అక్కడి కాలేజీలో చదువుకునే అవకాశం కలిగింది..ఆమె పట్టుదలకి మెచ్చిన ఎంతో మంది భారత ఎన్నారైల సంఘాలు..ఆమెకి అమెరికాలో చేదోడుగా ఉంటామని హామీ ఇచ్చారు.