ట్రిలియన్ డాలర్ కంపెనీగా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్  

Google Parent Alphabet Valuation Hit $1 Trillion, Joins Apple, Microsoft-apple,google Parent Alphabet Valuation,microsoft,nri,telugu Nri News Updates

గూగుల్… ఒక సెర్చింజిన్‌లా మొదలైన దీని ప్రస్థానం ఇప్పుడు మనిషి జీవితంలో భాగమైంది.ఇది లేనిదే రోజు గడవని పరిస్ధితి వచ్చేసింది.ప్రస్తుతం అన్ని రంగాలకు గూగుల్ ఒక దిక్సూచిగా మారిపోయింది.ఈ విజయ ప్రస్థానంలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ మరో మైలురాయిని సాధించింది.

Google Parent Alphabet Valuation Hit $1 Trillion, Joins Apple, Microsoft-apple,google Parent Alphabet Valuation,microsoft,nri,telugu Nri News Updates Telugu NRI USA America Latest News (తెలుగు ప్రపంచం-Google Parent Alphabet Valuation Hit $1 Trillion Joins Apple Microsoft-Apple Google Microsoft Nri Telugu Nri News Updates

గురువారం కంపెనీ మార్కెట్ విలువ తొలిసారిగా 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుని, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో అమెరికన్ టెక్ కంపెనీగా ఘనత వహించింది.

గూగుల్‌తో పాటు దాని అనుబంధ విభాగాలకు మాతృ సంస్థ ఆల్ఫాబెట్.ఇప్పటి వరకు గూగుల్‌కు మాత్రమే సీఈవోగా ఉన్న సుందర్ పిచాయ్‌‌ని ఆల్ఫాబెట్‌కు సైతం ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నియమిస్తూ గతేడాది కంపెనీ సంచలన ప్రకటన చేసింది.2018లో యాపిల్ ట్రిలియన్ డాలర్ల సంస్థగా అవతరించగా… ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 2018 సెప్టెంబర్‌లో ట్రిలియన్ డాలర్ల సంస్థగా ఎదిగింది.గురువారం నాటి ట్రేడింగ్‌లో ఆల్ఫాబెట్‌ షేరు ధర 0.76 శాతం పెరగడంతో గూగుల్ విలువ లక్ష కోట్లకు చేరింది.

తమరోవైపు గూగుల్‌కు గతేడాది ఒక్క వార్తలపైనే రూ.33 వేల కోట్ల ఆదాయం లభించింది.గూగుల్‌లో సెర్చ్, గూగుల్ న్యూస్ ద్వారా 2018లో ఇంతటి ఆదాయం ఆ సంస్థకు లభించినట్లు న్యూస్ మీడియా అలయన్స్ తెలిపింది.ఆన్‌లైన్ ప్రకటనల ఆదాయం తగ్గిపోతున్నందున కొన్ని మీడియా సంస్థలు మూతబడుతున్నా… గూగుల్‌కు మాత్రం ఆదాయం తగ్గడం లేదని ఎన్ఎంఏ తెలిపింది.

.

తాజా వార్తలు